18 మ్యాచ్ లు… 100 కోట్లు… బొక్కలు బయటపెట్టారు..!

BCCI says 100 crores income  for maharashtra for 18 IPL  matches, chief minister Devendra Fadnavis, Anurag Thakur నీటి సదుపాయాన్ని కలిగించలేము… కావాలంటే ముంబై నుండి మరో వేదికకు ఐపీఎల్ మ్యాచ్ లను తరలించుకోండి… మాకెలాంటి అభ్యంతరము లేదు… మైదానాలకు కావాల్సిన నీటిని మాత్రం తాము అందించలేము… అంటూ మహారాష్ట్ర సిఎం ఫడ్నవీస్ చేసిన ప్రకటనలు తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలు బీసీసీఐ వర్గాలు కూడా బాగానే బదులు చెప్పాయి.

మహారాష్ట్రలో ‘ఐపీఎల్’ క్రికెట్ పోటీలను ఆడనివ్వకుంటే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 100 కోట్ల ఆదాయం పోతుందని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు చేసారు. నీటి పేరిట మ్యాచ్ లను అడ్డుకోవడం తగదని ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కు హితవు పలికారు. గత సంవత్సరపు ఐపీఎల్ పోటీల తరువాత బీసీసీఐ నిర్వహించిన అధ్యయనంలో 100 కోట్ల మేరకు మహారాష్ట్రకు ఆదాయం వచ్చిందని, ఈ యేడాది అంతకు మించిన ఆదాయం రావచ్చని ఆయన అన్నారు. మహారాష్ట్రలో ముంబై సహా, పుణె, నాగపూర్ నగరాల్లో మొత్తం ఈ ఏడాది 18 మ్యాచ్ లు జరుగనున్నాయని తెలిపారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories