బెల్లంకొండ @ క్రేజీ హీరోయిన్లు!

Bellamkonda - Srinivas - Amy Jacksonమొదటి సినిమాలో సమంత… రెండవ సినిమాలో సోనరిక (హరహర మహదేవ్ ఫేం)… మూడవ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రజ్ఞా జైస్వాల్… మధ్యలో తమన్నాతో రెండు సార్లు ఐటెం సాంగ్స్… నాలుగవ సినిమా ‘సాక్ష్యం’లో (ప్రస్తుతం సెట్స్ పై) పూజా హెగ్డే… బహుశా ఏ టాలీవుడ్ హీరో కూడా ఇలా వరుసగా క్రేజీ హీరోయిన్లతో పని చేయలేదు. లిస్టు ఇక్కడితో అయిపొయింది అనుకుంటే పొరపాటే… నెక్స్ట్ సినిమాకు కూడా ఆల్ రెడీ క్రేజీ కాంబోను సెట్ చేసారు.

శ్రీనివాస్ అనే కొత్త దర్శకుడి నేతృత్వంలో ఇప్పటికే కాజల్ అగర్వాల్ ను ఒక హీరోయిన్ గా ఎంపిక చేయగా, తాజాగా ‘ఐ’ ఫేం అమీ జాక్సన్ ను మరో హీరోయిన్ గా సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది. హాట్ హీరోయిన్ గా అమీకున్న గుర్తింపు తెలియనిది కాదు. సోషల్ మీడియాలో అయితే ఈ లండన్ బ్యూటీ ఒక క్రేజీ అండ్ హాట్ బాంబ్. అలాంటి హీరోయిన్ ను తన తదుపరి సినిమాకు ఎంపిక చేయడం బహుశా బెల్లంకొండకే చెల్లింది. కొడుకుకు క్రేజీ కాంబోలను సెట్ చేయడంలో బెల్లంకొండ సురేష్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదని ప్రత్యేకంగా చెప్పాలా!

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories