బాబోయ్ మరో బెల్లం’కొండ’?

BellamkondaGanesh-debut-with-#Phaniఏ రంగంలో అయినా సక్సెస్ ను భేరీజు వేసుకుని ఆ రంగాన్ని ఎంచుకుంటారు..అయితే సినిమాల్లో మాత్రం బాక్గ్రౌండ్ ని ఆధారంగా చేసుకుని తమ ప్రతాపాన్ని ప్రేక్షకులకు చూపించాలి అని తెగ ఆరాట పడిపోతూ ఉంటారు.

[m9ad]

ADVERTISEMENT

ఇంతకీ అసలు విషయంలోకి వెళితే టాలీవుడ్ లో హీరోగా నిలదొక్కుకోవడానికి నానా యాతనలు పడుతున్నాడు మన బెల్లంకొండ పెద్ద కుమారుడు శ్రీనివాస్. అయితే ఇప్పటికీ శ్రీను హీరోగా ఇంకా సక్సెస్ కాలేదు అంటే నమ్మక తప్పదు.

అయితే ఈలోపు శీను తన తమ్ముడు గణేష్ ను టాలీవుడ్ లోకి తీసుకు వద్దాం అని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరో మూడు రోజుల్లో అంటే ఈ నెల 24 న బెల్లంకొండ గణేష్ ను హీరోగా పెట్టి ఒక సినిమాను అనౌన్స్ చేయనున్నాడు బెల్లంకొండ సురేష్.

మరి అసలే పెద్ద కొడుకు హిట్ కోసం ఎన్నాళ్ళు గానో ఎదురు చూస్తూ ఉంటే మరో పక్క చిన్న కొడుకుని రంగంలోకి దించడంలో బెల్లంకొండ సురేష్ ఆంతర్యం ఏంటో అర్ధం కావడంలేదు. ఏది ఏమైనా ఒక వారసుడినే హీరోగా చెయ్యడానికి నానా తంటాలు పడుతున్న సురేష్…రెండో కొడుకుతో ఎలాంటి జర్క్ ఇస్తాడో చూద్దాం.

ADVERTISEMENT
Latest Stories