భారీ అంచనాల నడుమ విడుదలైన రవితేజ ‘బెంగాల్ టైగర్’కు ప్రేక్షకుల నుండి భిన్న స్పందనలు వచ్చాయి. అయితే ‘మాస్’ వర్గాలను ఆకట్టుకునే చిత్రంగా పేరు తెచ్చుకోవడంతో తొలి రోజు ముగిసే సమయానికి భారీ కలెక్షన్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలు ఆశించాయి. అయితే మాస్ మహారాజా కెరీర్ లో అత్యధిక ఓపెనింగ్స్ సొంతం చేసుకున్న ‘కిక్ 2’ కలెక్షన్స్ ను కూడా ‘బెంగాల్ టైగర్’ దాటలేకపోయిందని సినీ వర్గాల టాక్.
మొత్తమ్మీద రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి ‘బెంగాల్ టైగర్’ 5 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిందని తెలుస్తోంది. ‘కిక్ 2’తో పోలిస్తే దాదాపుగా 2 కోట్లు తక్కువగా వసూలు చేసినట్లు సమాచారం. ఏపీ, తెలంగాణా తప్ప రవితేజకు ఇతర ఏరియాల్లో పెద్దగా మార్కెట్ లేదన్న విషయం తెలిసిందే. రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ లను కలుపుకున్నా మరో 50 లక్షలు కూడా దాటదని ట్రేడ్ పండితులు లెక్కలు కడుతున్నారు.
తొలి రోజు పరిస్థితి ఇలా ఉంటే, రెండవ రోజు ఉదయం ఆటకు ప్రేక్షకాధరణ తగ్గుముఖం పట్టడంతో ఈ సినిమా కమర్షియల్ గా ఎంతవరకు సక్సెస్ కాగలుగుతుందనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఈ వీకెండ్ గడిస్తే గానీ “బెంగాల్ టైగర్”పై ఫుల్ పిక్చర్ వచ్చే అవకాశం లేదు. తొలిరోజు చిత్రానికి లభించిన స్పందన పట్ల చిత్ర యూనిట్ కూడా ఒకింత నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది.





