కేసీఆర్ పాదయాత్ర…ఏపీ రాజకీయాలను కూడా ప్రభావితం చెయ్యగలదా.?

KCR announces Telangana padayatra amid political discussions

కేసీఆర్ త్వరలోనే తన ఫామ్ హౌస్ అజ్ఞాతానికి శుభం కార్డు వెయ్యనున్నట్టుగా స్వయంగా ఆయనే ప్రకటించారు. ఆదివారం జరిగిన బిఆర్ఎస్ శాసనపక్ష సమావేశంలో మాట్లాడుతూ త్వరలోనే తెలంగాణ నీటి హక్కుల కోసం తానూ లక్ష మందితో కలిసి పాదయాత్ర చేస్తానంటూ ప్రకటించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం తన చేతకాని పాలనతో కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తుందని, అందుకు గాను రైతులతో కలిసి ఆ రెండు ప్రోజెక్టుల సందర్శనకు పాదయాత్ర చేస్తానంటూ కేసీఆర్ ప్రకటించడంతో బిఆర్ఎస్ శ్రేణులలో మంచి జోష్ వచ్చిన్నట్టయింది.

ADVERTISEMENT

పార్టీ ఓటమి నుంచి నేటి వరకు కూడా కేసీఆర్ బహిరంగ రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ చేసిన పాదయాత్ర ప్రకటన బిఆర్ఎస్ శ్రేణులలతో పాటుగా అటు అధికార కాంగ్రెస్ నేతలకు కూడా ఊహించని షాక్ అనే చెప్పాలి.

అయితే తెలంగాణ ప్రజల మనోభావాలు, వారి భావోద్వేగాలు పూర్తిగా తెలిసిన నేతగా కేసీఆర్ తన పునరాగమాన్ని పాదయాత్రతో మొదలుపెడితే దాని ప్రభావం తెలంగాణ రాజకీయాలలో గట్టిగానే కనిపిస్తుంది. అయితే ఆ ప్రభావం పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ మీద కూడా పడుతుందా అన్నది ఇక్కడ చర్చనీయాంశంగా మారుతుంది.

గత 2019 ఎన్నికలలో తెలంగాణలో బిఆర్ఎస్ రాజకీయ గెలుపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కూడా ప్రభావితం చెయ్యగలిగింది. అలాగే 2024 ఎన్నికల ముందు ఏపీలో జరిగిన కొన్ని రాజకీయ పరిణామాల ప్రభావం 2023 తెలంగాణ ఎన్నికల పై స్పష్టంగా కనిపించింది.

ఈ నేపథ్యంలో త్వరలో తెలంగాణలో కేసీఆర్ చేస్తే పాదయాత్ర ఏపీ రాజకీయాల మీద ప్రభావం చూపగలదా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇప్పటికే ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ వచ్చే ఏడాదిలో రాష్ట్ర వ్యాప్తంగా తన పాదయాత్ర ఉంటుందని, తద్వారా ఏపీలో జగన్ 2.0 సిద్ధం అంటూ ప్రకటించారు.

అలాగే అటు తెలంగాణ విషయానికొస్తే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం కేసీఆర్ ని మూడో సారి ముఖ్యమంత్రిని చేసేందుకు రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర చేస్తానంటూ ప్రకటించారు. ఇక ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీని గద్దె దింపేందుకు తానూ కూడా పాదయాత్రకు సిద్ధమంటూ కేసీఆర్ ప్రకటించడంతో ఈ ముగ్గురు నేతల పాదయాత్రలు వారి అధికారానికి మోక్ష మార్గాలుగా మారాయ అన్న చర్చ నడుస్తుంది.

వైసీపీ, బిఆర్ఎస్ మధ్య నడుస్తున్న అంతర్గత రాజకీయ సంబంధాలతో ఒక పార్టీ గెలుపు, మరోపార్టీ విజయాన్ని, ఒక పార్టీ ఓటమి మరోపార్టీ పరాజయాన్ని సూచిస్తున్న ఈ నేపథ్యంలో కేసీఆర్ పాదయాత్ర తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేయడంతో పాటుగా ఏపీ రాజకీయాలను కూడా ప్రలోభపెట్టగలదా అన్న ఆసక్తి ఇరు పార్టీల శ్రేణులలో కనిపిస్తుంది.

వీరిద్దరి బంధం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సంబంధాన్ని రాజకీయంగా బలహీనపరచగలదా.? ఒకవేళ బిఆర్ఎస్ ఆశించినట్టుగా తెలంగాణ రాజకీయాలలో కేసీఆర్ పాదయాత్ర ప్రభావం కనిపించకపోతే ఇటు ఏపీ అధికారం పై వైసీపీ ముందే ఆశలు వదులుకుంటుందా.? ఇలా కేసీఆర్ ఒక్క పాదయాత్ర ఇరు రాష్ట్ర రాజకీయాల పై ఏమేరకు ప్రభావం చూపగలదో అన్నది రానున్న రోజులలో తేలనుంది..!

ADVERTISEMENT
Latest Stories