‘భరత్ అనే నేను’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్!

Bharat Ane Nenu US Collectionsగత శుక్రవారం నాడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన కొరటాల – మహేష్ బాబుల “భరత్ అనే నేను” అద్భుతమైన ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తొలి రోజు బ్రహ్మాండమైన కలెక్షన్స్ తో ప్రారంభమైన ఈ సినిమా మూడు రోజులలో రికార్డు వసూళ్లు సాధించగా, ఆ తర్వాత వీకెండ్ లో కాస్త నెమ్మదించింది. మొత్తంగా ‘భరత్ అనే నేను’ ద్వారా ప్రిన్స్ తొలి వారం ఎంత కొల్లగొట్టారు? అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

అయితే అధికారికంగా నిర్మాతలు కలెక్షన్స్ చెప్పడం ఎప్పుడో మానేసారు. గతంలో పీఆర్వో అయిన బిఎరాజు తదితరుల ద్వారా ఏరియాల వారీగా ట్వీట్లు చేసే వారు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. మొత్తంగా చిత్ర నిర్మాణ సంస్థ ఒక పోస్టర్ ను రిలీజ్ చేసి సరిపెడుతున్నారు. అయితే ఈ కలెక్షన్స్ లో నాణ్యత కొరవడుతోంది. ఒక్క ఓవర్సీస్ కలెక్షన్స్ మాత్రమే అధికారికంగా నమ్మే పరిస్థితి నెలకొంది. యుఎస్ మార్కెట్ లో 2.7 మిలియన్ సాధించి, 3 మిలియన్ దిశగా సాగుతోంది. ఆస్ట్రేలియాలో అయితే హాఫ్ మిలియన్ దాటి వసూళ్లు చేయడం ఊహించని పరిమాణం.

ADVERTISEMENT

ఇక స్థానికంగా ఏపీ, తెలంగాణాలలో మొదటి మూడు రోజుల తర్వాత కలెక్షన్స్ నెమ్మదించాయన్నది వాస్తవం అయినప్పటికీ, దారుణమైన రీతిలో డ్రాప్ కాకపోవడం అనేది స్పష్టం. ‘బ్లాక్ బస్టర్’ టాక్ వచ్చినంత స్థాయిలో ‘కలెక్షన్స్’ ఉంటాయా? లేదా? అన్న ఆసక్తితో ప్రస్తుతం అందరి చూపులు మొదటి వారం కలెక్షన్స్ వైపుకు మళ్ళాయి. ట్రేడ్ టాక్ ప్రకారం… తొలి వారంలో అయితే నాన్ బాహుబలి రికార్డు కొల్లగొట్టినప్పటికీ, లాంగ్ రన్ లో ‘రంగస్థలం’ను దాటుతుందా? లేదా? అనేది వేచిచూడాల్సిన అంశంగా మారింది.

ADVERTISEMENT
Latest Stories