రేపు ఒక్కరోజే భరత్ ది !

bharat-ane-nenu--collectionsమహేష్ బాబు ‘భరత్ అనే నేను’ గత శుక్రవారం రిలీజ్ అయ్యింది. రికార్డు కలెక్షన్స్ తో దూసుకుపోతున్నది. వందకోట్లకు పైగా వసూల్ చేసిన ఈ సినిమా కలెక్షన్లు, ఈ సోమవారం నుండి తగ్గు ముఖం పట్టాయి. ప్రచారం విస్తృతంగా చేస్తున్నా.. పొలిటికల్ జోనర్ సినిమా అవడం వలన, రిపీట్ ఆడియన్స్ తగ్గారు. ఇక ఈ శుక్రవారం .. సాయి పల్లవి – కణం, విష్ణు – ఆచారి అమెరిక యాత్ర, హాలీవుడ్ డబ్బింగ్ చిత్రం అవెంజర్స్ – ఇన్ఫినిటీ వార్.. సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.సినిమా రిలీజ్ కాకుండానే అవెంజర్స్ .. బ్లాక్ బస్టర్ అని,కలెక్షన్ల వర్షం కురిపిస్తుందని, ప్రముఖ సినీ ట్రేడ్ పండితుడు – తరన్ ఆదర్శ్ ప్రకటించేశాడు.

సినిమాలో కథా బలం తక్కువ ఉండటం, కామెడీ లేకపోవడం, సరైన పాటలు లేకపోవడం ‘భరత్ అనే నేను’ కు మైనస్ పాయింట్స్ కాగా.. రిపీట్ ఆడియన్స్ కరువయ్యారు. రామ్ చరణ్ రంగస్థలం మంచి కథ, కథనం తో ఇప్పడు కూడా మంచి వసూళ్లు చేస్తుంది.మహేష్ – కొరటాల ఇద్దరూ తెలంగాణ ఐ టి మంత్రి కె. టి. ఆర్ ను కలిశారు, కె. టి. ఆర్ ‘భరత్ అనే నేను’ సినిమా చూసి మహేష్ – కొరటాలను ప్రశంసించారు. ఎన్ని ప్రచారాలు చేసినా.. ఎన్ని ఇంటర్వ్యూ లు ఇచ్చినా.. 27వ తారీఖు నుండి భరత్ కలెక్షన్స్ తగ్గడం ఖాయం. విష్ణు – ఆచారి అమెరికా యాత్ర.. కామెడీ సినిమా కాగా, సాయి పల్లవి – కణం థ్రిల్లర్. ఈ రెండు సినిమాల్లో ఏది క్లిక్ అయినా.. భరతుడికి హుండీ లో లెక్క తగ్గడం ఖాయం!

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories