కొరటాల శివ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా “భరత్ అనే నేను” సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిగా మహేష్ బాబు ప్రమాణ స్వీకారం చేసిన ఆడియో ద్వారా ఈ సినిమా టైటిల్ ను రివీల్ చేయగా, మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపధ్యంలో… అందరి కళ్ళు ఈ సినిమా వైపుకు మళ్ళుతున్నాయి. సిఎంగా ప్రిన్స్ డైలాగ్స్ ఫ్యాన్స్ ను ఫిదా చేయడమే కాకుండా, సగటు ప్రేక్షకుడికి కూడా సినిమాపై ఆసక్తిని పెంచేలా చేసాయి.
ఊహాజనితమే అయినా… ఈ సినిమాను మహేష్ బాబు కాకుండా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసి ఉంటే..! బహుశా ఊహించుకుంటే పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఒళ్ళు జలదరిస్తుందేమో! నిజమే… పవన్ కళ్యాణ్ ఈ సినిమా చేసి ఉంటే, పార్టీ పరంగా ‘జనసేన’కు చాలా దోహదపడి ఉండేదని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే ఈ సినిమాలో రొమాంటిక్ అండ్ రెగ్యులర్ కంటెంట్ కంటే పొలిటికల్ మ్యాటర్ ఎక్కువగా ఉందన్న విషయం బహిర్గతమవుతోంది. ఇందుకోసమే డబ్బింగ్ విషయంలో మహేష్ బాబు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ గనుక చేసి ఉంటే బాక్సాఫీస్ పరంగా సమ్మర్ సెన్సేషన్ కంటే కూడా, ‘జనసేన’ పార్టీ పరంగా ఎక్కువ లాభదాయకంగా ఉండేది. అయితే ఇలాంటి సినిమాను పవన్ చేస్తే వివాదాలు కూడా చుట్టుముడతాయని చెప్పడంలో సందేహం లేదు. మహేష్ బాబు అంటే రాజకీయాలకతీతంగా చూస్తారు కాబట్టి… ఎలాంటి డైలాగ్స్ చెప్పినా సినిమాగా చూస్తారు. కానీ పవన్ విషయంలో ఎవరూ అలా స్వీకరించలేరు. అయినప్పటికీ ఇలాంటి పొలిటికల్ కంటెంట్ సినిమా తర్వాత ప్రజల్లోకి వెళితే… ఉండే ఆ ఊపే వేరు కదా..! ఫ్యాన్స్ కోరుకుంటోంది కూడా అదే..!



