ఇండియాలో ఓకే… యుఎస్ లో ఇలా ఎలా..?

Bharat-Ane-Nenu-Break-Even-Figure-in-the-US‘భరత్ అనే నేను’ మొదటి వారం దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఇండియాలో కలెక్షన్స్ అయితే బహిర్గతం కావట్లేదన్న టాక్ ఉంది గానీ, ఓవర్సీస్ లో అయితే కలెక్షన్స్ విషయంలో క్లియర్ కట్ సమాచారం ఉంది. తొలి వారం ముగిసే సరికి 2.75 మిలియన్ డాలర్స్ తో ‘నాన్ బాహుబలి’ రికార్డు కొట్టిందన్న మాట వాస్తవమే గానీ, నిజానికి ఇది మహేష్ రేంజ్ ను సూచిస్తోందా? అంటే నోరెళ్ళబెట్టాల్సిందే.

ఎందుకంటే… ‘రంగస్థలం’ తొలి వారం ముగిసే సమయానికి 2.73 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది. అంటే ఈ రెండు పెద్ద సినిమాలకు ఉన్న తేడా కేవలం 17కే డాలర్స్ మాత్రమే! అంటే ఈ 17కే డాలర్స్ నే మహేష్ స్టామినాగా చెప్పుకోవాలా? అంటే ఖచ్చితంగా కాదనే సమాధానం వస్తుంది. యుఎస్ మార్కెట్ లో మహేష్ కున్న ఫాలోయింగ్ ను ఏ ఇతర టాలీవుడ్ హీరోతో పోల్చదగినది కాదు. ఎందుకంటే మహేష్ ఫ్లాప్ సినిమాలే అవలీలగా 1 మిలియన్ డాలర్స్ వసూలు చేసిన ట్రాక్ రికార్డు ఉంది.

ADVERTISEMENT

మరి ఎక్కడ తేడా కొట్టింది? సోషల్ మీడియా అంతటా ‘బ్లాక్ బస్టర్’ టాక్! రివ్యూలన్నీ ఎక్సలెంట్! (పబ్లిష్ అయిన రివ్యూలలో మా టీం అందించిన రివ్యూనే 3 రేటింగ్స్ స్వల్పం). ఫ్లాప్ టాక్ వచ్చినపుడు రివ్యూలన్నీ ప్రభావితం చూపుతున్నాయని గగ్గోలు పెడుతున్న మాట వాస్తవమే అయితే, ‘బ్లాక్ బస్టర్’ రివ్యూలు ఇచ్చినా, ఆ ప్రభావం ‘భరత్ అనే నేను’ మీద ఎందుకు పడలేదు? అంటే రివ్యూల కంటే ‘మౌత్ టాక్’ ప్రభావం ఎక్కువ ఉందని అంగీకరించాలా? అదీ కాదంటే… ‘భరత్ అనే నేను’ కంటెంట్ యుఎస్ ప్రేక్షకులను అమితంగా ఆకర్షించలేకపోయిందా? లేదా ప్రమోషన్స్ మెటిరియల్ డల్ గా అనిపించాయా?

‘భరత్ అనే నేను’ ఖచ్చితంగా హిట్. అది ఎవరూ కాదనలేరు. కానీ బ్లాక్ బస్టర్ రేంజ్ కాదన్న సంకేతాలు ఫస్ట్ వీక్ ముగిసే సమయానికి అందుతోన్న సంకేతాలు. బ్లాక్ బస్టర్ రేంజ్ మహేష్ కు పడితే, ఈ సమయానికి కలెక్షన్స్ ఖచ్చితంగా 4 మిలియన్స్ రేంజ్ లో ఉండాలి. నిజానికి ప్రీమియర్స్ దగ్గర నుండే ‘భరత్ అనే నేను’ వెనుకడుగులో ఉంది. కేవలం 800 కే డాలర్స్ ప్రీమియర్స్ ద్వారా అనేది అస్సలు ఊహించలేనిది. ‘స్పైడర్’కే 1 మిలియన్ వచ్చినపుడు, అంతకు డబుల్ వసూల్ చేయాల్సిన ‘భరత్ అనే నేను’ ఆ అంచనాలను అయితే అందుకోలేదు.

మహేష్ బాబు, కొరటాలలు ఖచ్చితంగా దీనిని సమాలోచనలు చేసుకోవాలి. ముఖ్యంగా ‘శ్రీమంతుడు’ నుండి మహేష్ బాబు కనపరుస్తున్న ఒకే తరహా నటన యుఎస్ వాసులను ఆకర్షించడం లేదన్న అంశం అక్కడి ప్రేక్షకుల నుండి లభ్యమవుతోంది. కొత్తదనానికి పెద్ద పీట వేసే యుఎస్ ప్రేక్షకులు, ‘రంగస్థలం’కు పట్టాభిషేకం చేయడం వెనుక రామ్ చరణ్ మేకోవర్ కూడా కీలకపాత్ర పోషించింది. మహేష్ విషయంలో అదే దెబ్బతీసిందనేది గ్రౌండ్ లెవల్ రిపోర్ట్. దీంతో అర్జెంటుగా నెక్స్ట్ మూవీతో మహేష్ తన గెటప్ ను, నటనను మార్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

ADVERTISEMENT
Latest Stories