మహేష్ బాబు ను వెంటాడుతోన్న ‘బిచ్చగాడు’

Deepa Ramanujam, Deepa Ramanujam Mahesh Babu, Deepa Ramanujam Mahesh Babu Movie, Mahesh Babu Mother Deepa Ramanujam , Mahesh Babu Mom Deepa Ramanujam, Bichagadu Mother Deepa Ramanujam Mahesh Babu Movieఈ ఏడాది సమ్మర్లో విడుదలైన ప్రిన్స్ మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ సినిమాను తమిళ డబ్బింగ్ సినిమా ‘బిచ్చగాడు’ తీవ్రంగా దెబ్బతీసిన విషయం తెలిసిందే. మరో రకంగా చెప్పాలి అంటే… ‘బ్రహ్మోత్సవం’ సినిమా ఫలితం ‘బిచ్చగాడు’ సినిమాకు అనుకూలంగా మారి, లక్షల రూపాయలలో తీసుకున్న డబ్బింగ్ హక్కులకు, తెలుగు ప్రేక్షకులు కోట్ల రూపాయలు కుమ్మరించారు. ఈ రకంగా ‘బిచ్చగాడు’కు మహేష్ బాబుకు పరోక్షంగా ఓ అవినాభావ సంబంధం ఏర్పడింది.

ఆ బంధం తన తాజా సినిమాలోనూ కొనసాగుతోందని టాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. తమిళ టాప్ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ నటించబోతున్న సినిమా ఈ నెల 29వ తేదీ నుండి చెన్నైలో సెట్స్ పైకి వెళ్లనుండగా, ప్రిన్స్ మాత్రం ఆగష్టు ఒకటవ తేదీ నుండి షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు తల్లిగా ‘బిచ్చగాడు’ ఫేం దీపా రామానుజంని ఎంపిక చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ‘బిచ్చగాడు’ సినిమాలో విజయ్ అంటోనీకి తల్లిగా నటించి తెలుగు, తమిళ ప్రేక్షకులకు దగ్గరైన దీపానే ప్రిన్స్ తల్లి అన్న విషయంపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.

ADVERTISEMENT

బహుశా దర్శకుడు మురుగదాస్ ఈ విషయంలో స్పష్టత ఇస్తారేమో చూడాలి. ఇటీవల హీరోయిన్ ఎంపిక విషయంలో తర్జన భర్జన వార్తలు ప్రసారం కాగా, చివరికి రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది అంటూ మురుగదాస్ ట్విట్టర్ ద్వారా చెప్పిన విషయం తెలిసిందే. హీరోయిన్ రకుల్ మాదిరే ప్రిన్స్ మదర్ దీపా విషయంలోనూ మురుగదాస్ క్లారిటీ ఇస్తారేమో!

ADVERTISEMENT
Latest Stories