నోటు మీద ఉన్న బాపునే కాదు నోటు తీసుకొన్న బాబుది అదే పరిస్థితి!

big-notes-ban-common-people-problemsపాత పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుడి నిత్యావసర పనులకు కొంత మేర నగదు కొరత ఏర్పడిందనే చెప్పాలి. అయితే ఆ నోట్లను మార్పిడి చేసుకోవడానికి బ్యాoకుల దగ్గర పడిగాపులు పడి కొత్త నోట్లను లేదా చలామణిలో ఉన్న నోట్లను తీసుకొన్న ప్రతి సామన్యుడి ముఖం మీద అదే చిరునవ్వు కనపడుతుందనే చెప్పాలి. తమ దగ్గర ఉన్న సొమ్ము తాము తీసుకొని కూడా ఇంత సంతోషాన్ని చూడడం మాత్రం ఇదే తొలిసారి అని చెప్పక తప్పదు.

ప్రతి సామన్య, మధ్యతరగతి ప్రజలను ఇబ్బంది పెట్టిన ఈ నిర్ణయం మునుముందు కాలంలో నల్ల కుభేరుల పాలిట బలంగా లేకపోతే మాత్రం ఇప్పుడు స్వాగతించిన ఈ ప్రజలే రేపు దీటైన జవాబు ఇస్తారని ప్రభుత్వాలు గుర్తుంచుకోవాలి. భావితరాల భవిష్యత్తు కోసం ఎ తప్పు చేయని సామన్య, నిరుపేద కుటుంబాలు కూడా ఈ ఇబ్బందులను ఎదుర్కోవడానికి సిద్దం అయ్యారు అంటే కారణం ఒక్కటే అది వారి పిల్లల తరంలో అయిన గాంధీ గారు కలలు కన్న భారతావనిని చూడడం కోసం.

ADVERTISEMENT

పవన్ కళ్యాణ్ అన్నట్లు “బలవంతులకు బలహీనంగా” –“బలహీనులకు బలవంతంగా” ఈ చట్టాలు ఉండకూడదు. అప్పుడే ప్రతి భారతీయ పౌరూడి ముఖం మీద గాంధీ గారు ఆశించిన నవ్వులు ప్రభుత్వాలకు కనిపిస్తాయి.

ADVERTISEMENT
Latest Stories