రాప్తాడు జెడ్పీ స్కూల్లో దారుణం… పాపం ఎలా భరించిందో!

Rapthadu school attack in Anantapur district

అమెరికాలోని పాఠశాలలపై దుండగులు తుపాకులతో కాల్పులు జరిపారని, పలువురు విద్యార్ధులు గాయపడ్డారనో, చనిపోయారనో వార్తలు తరచూ వింటూనే ఉన్నాము. ఇప్పుడు మన రాష్ట్రంలో అంతకంటే చాలా దారుణమైన దాడి జరిగింది.

అనంతపురం జిల్లా రాప్తాడులో ఒక ఉన్మాది స్థానిక జెడ్పీ పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై చెట్లు కోసే రంపం మెషిన్‌తో దాడి చేశాడు.

ADVERTISEMENT

తరగతి గదిలో టీచర్ పాఠాలు చెపుతున్నప్పుడు హటాత్తుగా ఆ దుండగుడు లోనికి ప్రవేశించి, నేరుగా ఓ బాలిక వద్దకు వెళ్ళి తన రంపం మెషిన్ ఆన్‌ చేసి మొదట ఆమె గొంతు కోయబోయాడు.

ఆమె భయంతో కేకలు వేస్తూ చెయ్యి అడ్డుపెట్టగా రంపం మెషిన్‌తో ఆ చేతిని కోసి పడేశాడు. ఆమెతో సహా తరగతి గదిలో ఉన్న విద్యార్దినులు భయంతో కేకలు పెడుతుండగానే, అతను దాంతో ఆ బాలికపై విచక్షణారహితంగా దాడి చేసి తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. అందరూ చూస్తుండగానే ఈ దారుణం జరిగిపోయింది.

స్కూల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన అంబులెన్సుతో అక్కడకు చేరుకొని చెయ్యి తెగి తీవ్రంగా గాయపడిన ఆ విద్యార్ధినిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

పోలీసులు వెంటనే అతని కోసం గాలింపు మొదలుపెట్టి ధర్మవరం రైల్వే స్టేషన్‌ వద్ద పట్టుకున్నారు. నాగులూరుకు చెందిన హేమంత్‌గా పోలీసులు గుర్తించారు.

ఈ ఘటనపై సిఎం చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ వెంటనే స్పందించారు. సిఎం చంద్రబాబు నాయుడు ఆ విద్యార్ధిని తల్లితో మాట్లాడి ఆమెకు ధైర్యం చెప్పారు. ఆ బాలికకు అత్యుత్తమ వైద్య చికిత్స అందించి కాపాడుతామని, ఆమెపై దాడి చేసిన ఆ దుండగుడుకి కటినాతి కటినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు.

మంత్రి నారా లోకేష్‌ స్పందిస్తూ, “చిన్నారి చెల్లిని క్లాస్ రూములో నెత్తుటి మడుగులో చూశాక కన్నీళ్లు ఆగడం లేదు. గుండె బరువెక్కింది. రాప్తాడులో ఉన్మాది ఘాతుకం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఉన్మాదులను ఉక్కు పాదంతో అణిచేస్తాం. ఆడపిల్లలు, మహిళల వైపు కన్నెత్తి చూడాలంటే భయపడేలా చేస్తాం. పిల్లల భద్రత పట్ల నిర్లక్ష్యం వహించేవారు ఎంతటి వారైనా చర్యలు తప్పవు,” అని ట్వీట్‌ చేశారు.

ADVERTISEMENT
Latest Stories