కరోనా కన్నా తీవ్రమైన వైరస్ లా సామాన్యుడిని బాధిస్తుంది ‘బర్డ్ ఫ్లూ’. ఈ బర్డ్ ఫ్లూ ఫలితంగా చికెన్ ప్రియులు తెగ బాధపడిపోతున్నారు. అతి తక్కువ ధరకే చికెన్ అందుబాటులో ఉన్నప్పటికీ కొనలేని పరిస్థితి, తినలేని దుస్థితి.
ఇటు బర్డ్ ఫ్లూ వైరస్ ప్రభావంతో పౌండ్రీ పరిశ్రమ కూడా కుదేలైపోయింది. వేలాది కోళ్లు ఈ ఫ్లూ బారిన పడి మరణించడంతో ఆయా పరిశ్రమ పై ఆధారపడ్డ వారి జీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది.
ఇన్నాళ్లు పెట్టుబడి పెట్టి పెంచిన కోళ్లు కళ్ళ ముందే ప్రాణాలు విడుస్తున్నా ఏమి చెయ్యలేని నిస్సహాయతో ఫౌండ్రి యజమానులు అల్లాడుతున్నారు. ఇక వీరి బాధ ఇలా ఉంటే చికెన్ లవర్స్ గోడు మరోలా ఉంది. తక్కువ రేటులో చికెన్ అందుబాటులో ఉన్నా కొనే సాహసం చెయ్యలేక అధిక ధరలను వెచ్చించి మరి మటన్, ఫిష్, ఫ్రాన్స్ అంటూ పక్క చూపులు చూసుకుంటున్నారు.
దీనితో ఇక మటన్ రేట్లు కొండెక్కి కూర్చుకున్నాయి. ఇలా చికెన్ తినలేక అలా మటన్ కొనలేక ఫ్లూ వచ్చిన కోళ్ల మాదిరి గిలగిలా కొట్టుకుంటున్నారు నాన్ వెజ్ ప్రియులు. బిర్యానీ తింటే కానీ ముద్ద దిగని వారు, చికెన్ చూస్తే కానీ ముద్ద ముట్టని వారి పరిస్థితి అత్యంత బాధకారమనే చెప్పాలి.
ఈ బర్డ్ ఫ్లూ దెబ్బతో ఇప్పటికే అనేక వేల కోళ్లు మృత్యు వాత పద్దడంతో ఇక అటు పిమ్మట ఈ ఫ్లూ నుంచి కోళ్ల పరిశ్రమ కోలుకుని తిరిగి వ్యాపారం మొదలు పెట్టె సరికి డిమాండ్ కి తగ్గ సప్లై లేక ఇక చికెన్ రేట్లు, కోడి గుడ్డల రేట్లు కూడా మటన్ రేట్ల మాదిరి మోత మోగించడం ఖాయంగా కనిపిస్తుంది.
దీనితో ఇప్పుడు ఫ్లూ భయంతో దూరమైన చికెన్ కు అప్పుడు ధరలు బెడదతో దూరంగా ఉంటారు. ఏదిఏమైనా అందుబాటులో ఉన్నప్పుడే అందుకోవాలి అంటూ కొంతమంది నాన్ వెజ్ ప్రేమికులు మాత్రం ఇవేమి పట్టకుండా చికెన్ ను తినే సాహసానికి సై అంటూ వంటకాలను ఆస్వాదించే పనిలో ఉన్నారు.
అయితే చికెన్ ప్రియుల కోసమో, నాన్ వెజ్ లవర్స్ కోసమో కాదు కానీ ప్రభుత్వాలు మాత్రం ఈ సమస్యను అతి తొందరగా పరిష్కరించి తమ పౌండ్రీ పరిశ్రమను ఆదుకోవాలంటూ విన్నవించుకుంటున్నారు కోళ్ల ఫారం యజమానులు.




