వైఎస్సార్ కాంగ్రెస్ పై మారిన బీజేపీ స్వరానికి ఇది నిదర్శనమా?

BJP ex-MLA p manikyala rao comments on ys jaganvolunteers (1)2014 తరువాత ప్రభుత్వంలో భాగస్వామి అయ్యుండి కూడా బీజేపీ టీడీపీ మీద విమర్శలు కురిపించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన సంగతి తెల్సిందే. ఆ తరువాత కాలంలో టీడీపీతో తెగతెంపులు అయ్యాకా పూర్తి స్థాయిలో ఆ పార్టీ వారు చంద్రబాబు ఓటమికి పని చేసి ఆయనను గద్దె దించారు. అయితే జగన్ కు సన్నిహితంగా కనిపించిన బీజేపీ ఇప్పుడు స్వరం మార్చడం విశేషం. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పట్టిన గతే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి పడుతుందని మాజీ మంత్రి పి.మాణిక్యాలరావు జోస్యం చెప్పారు.

జన్మభూమి కమిటీల వలనే తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందని, ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం కూడా వలంటీర్ల పేరుతో అదే వ్యవస్థను తీసుకువస్తున్నారని అన్నారు. చంద్రబాబు విధానాలనే సీఎం జగన్‌ మోహన్ రెడ్డి కూడా అనుసరిస్తున్నారన్నారు మాజీ మంత్రి గారు. ఈ వ్యాఖ్యలు వైఎస్సార్ కాంగ్రెస్ పై బీజేపీ మారిన స్వరాన్ని సూచిస్తుందా అని పలువురు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆ రకంగా వచ్చే రోజులలో జగన్ ప్రభుత్వానికి కూడా గడ్డు కాలం ఎదురు కావొచ్చు.

ADVERTISEMENT

ఇది ఇలా ఉండగా కేంద్రం డబ్బులు ఇచ్చినా టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారన్నారు. . బీజేపీ చిత్తశుద్ధితో పనిచేస్తుందనే ప్రజలు కేంద్రంలో మళ్లీ పట్టం కట్టారన్నారు. టీడీపీ మునిగిపోతున్న నావని పేర్కొన్నారు. టీడీపీ నుంచి బీజేపీకి వలసలు వస్తుండడమే అందుకు నిదర్శనమని చెప్పా రు. ఇంతకూ బీజేపీ చిత్తశుద్ధితో పనిచేస్తుందనే ప్రజలు కేంద్రంలో మళ్లీ పట్టం కట్టిన ప్రజలు ఆంధ్రప్రదేశ్ లో కనీసం ఒక్క స్థానంలో అయినా డిపాజిట్ దక్కకుండా ఎందుకు ఓడగొట్టినట్టు?

ADVERTISEMENT
Latest Stories