శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం “బ్రహ్మోత్సవం” కధ విజయవాడ నేపధ్యంలో సాగనున్న విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమా షూటింగ్ కొంత భాగం విజయవాడలో చిత్రీకరిస్తారని గతంలో వార్తలు హల్చల్ చేసాయి. అయితే ఇప్పటివరకు హైదరాబాద్, ఊటీ వంటి అవుట్ డోర్ లలో మాత్రమే షూటింగ్ జరుపుకుంది.
అయితే తాజాగా విజయవాడలో కెమెరా మెన్ రత్నవేలు పర్యటించి… కనకదుర్గమ్మ గుడి వద్ద, ప్రకాశం బ్యారేజి వద్ద పలు షాట్లను చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన స్టిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల గానీ, ప్రిన్స్ మహేష్ గానీ లేకుండా వచ్చిన ఈ స్టిల్స్ షూటింగ్ లో భాగమో లేక లొకేషన్స్ ఎంపిక అన్న సమాచారం తెలియాల్సి ఉంది. మొత్తానికి “బ్రహ్మోత్సవం” కధ అయితే విజయవాడకు సంబంధించినదేనని మరోసారి స్పష్టమైంది.
ADVERTISEMENT
ADVERTISEMENT





