టీజర్ టాక్ – ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ కాన్సెప్ట్!

brand-babu-official-teaser‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో ప్రారంభమైన దర్శకుడు మారుతీ కధలలో మరో ఎంటర్టైన్మెంట్ మూవీ వచ్చి చేరేటట్లుగా “బ్రాండ్ బాబు” టీజర్ కనిపిస్తోంది. తాను వేసుకునే కాస్ట్యూమ్స్ మాత్రమే కాదు, ఎదుటి వ్యక్తి ధరించే కాస్ట్యూమ్స్ లో కూడా ‘బ్రాండ్’ లేకపోతే అస్సలు మాట్లాడడానికే ఇష్టపడని హీరో, ఒక సాధారణ అమ్మాయిని ఎలా ప్రేమిస్తాడు? అనేది సినిమా కాన్సెప్ట్.

మారుతీ మార్క్ కాన్సెప్ట్ కధనంతో సాగిన టీజర్ ఆద్యంతం వినోదభరితంగా ఉంది. టీజర్ చివరిలో మురళీశర్మ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ అయితే మరోసారి ‘భలే భలే మగాడివోయ్’ను గుర్తు చేసిందని చెప్పవచ్చు. ‘నెక్స్ట్ నువ్వే’ సినిమాతో ‘ఈటీవీ’ ప్రభాకర్ మెగా ఫోన్ పట్టుకుని ఈ సినిమాకు దర్శకత్వం అందించగా, తొలి సినిమాతోనే శైలేంద్ర ప్రొడక్షన్స్ (హీరో సొంతం) వాల్యూస్ బాగున్నాయి.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories