బిఆర్ఎస్ ముందు ఎన్నో ప్రశ్నలు…కేసీఆర్ జవాబు చెపుతారా.?

Will KCR Answer the Party’s Questions

ఉద్యమంలా ఎగిసిన బిఆర్ఎస్ కెరటంలా వెనక్కి మళ్లిందా.? నాడు తెరాస కి ప్రాణం పోసిన కేసీఆరే నేడు బిఆర్ఎస్ ఉసురు తీస్తున్నారా.? నాడు కేసీఆర్ కి బలమైన కుటుంబమే నేడు భారమయ్యిందా.? బలహీనతయ్యిందా.?

నాడు తన వాక్చాతుర్యం తో పొరుగు రాష్ట్రాల నాయకులను సైతం కట్టడి చేసిన కేసీఆర్ నేడు తన సొంత కూతురు ఎదురుదాడికి తలొగ్గారా.? నాడు తన కుడి భుజంగా కలిసి నడిచిన హరీష్ నేడు కంటికి కునుకులేకుండా చేస్తున్నారా.?

ADVERTISEMENT

గతంలో ప్రత్యర్థి పార్టీలను రాజకీయంగా అణిచివేసిన కేసీఆర్ ఇప్పుడు అదే ప్రత్యర్థి చేతిలో అణిచివేతకు గురయ్యారా.? నాడు తన మాటే శాసనం అంటూ రాజకీయం నడిపిన నేత నేడు సొంత కుమార్తె చేతిలోనే మాటలు పడుతున్నారా.?

ఏ పార్టీ (టీడీపీ) పతనం కోసం ఆరాటపడ్డారో, ఏ నాయకుడి (రేవంత్) ఓటమి కోసం ఆశ పడ్డారో ఇప్పుడు ఆ ఇద్దరే బిఆర్ఎస్ ఓటమిని నిర్దేశించారా.? కేసీఆర్ ను ఫామ్ హౌస్ కి పరిమితం చేసారా.?

నాడు తెలంగాణ రాజకీయాలలోకి టీడీపీ ని అడుగుపెట్టనివ్వను అంటూ పంతం పట్టిన కేసీఆర్, పగ పట్టిన తెరాస నేడు తెలంగాణ రాజకీయాల నుండి కనుమరుగయ్యాయి. కేసీఆర్ ప్రజాక్షేత్రానికి దూరమైయే తెరాస బిఆర్ఎస్ గా రూపం మార్చుకుంది.

అయితే తిరిగి బిఆర్ఎస్ పుంజుకోవాలి అంటే రాజకీయంగా ప్రత్యర్థి పై పై చేయి సాధించాలి అంటే కేసీఆర్ రాజకీయంగా యాక్టీవ్ అవ్వాల్సిందేనా.? లేక కేటీఆర్ తన పంధా మార్చుకుని పార్టీలో అందరిని కలుపుకుని ముందుకెళ్లాలా.?

కవిత బిఆర్ఎస్ కి బరువా.? బలహీనతా.? లేక బిఆర్ఎస్ కి ప్రత్యర్థా.? బిఆర్ఎస్ భవిష్యత్ కేటీఆర్.? హరీష్ .? ఇలా ఎన్నో ప్రశ్నలు బిఆర్ఎస్ క్యాడర్ ని ముందుకెళ్లనివ్వడం లేదు. వాటి పై కేసీఆర్ పూర్తి స్పష్టత ఇస్తే దాని తాలూకా ఫలితాలు మరోలా ఉండే అవకాశం ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories