కవితకు మౌన పోరాటాలు…హరీష్ కి బహిరంగ మద్దతులా.?

BRS silence on Kavitha arrest vs Harish support

బిఆర్ఎస్ పార్టీ పై కవిత ఆరోపణలు వాస్తవాలే అన్నట్టుగా బిఆర్ఎస్ వ్యవహారం నడుపుతుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ గా, కల్వకుంట్ల ఇంటి ఆడపడుచుగా ఉన్న కవిత అరెస్టు విషయంలో బిఆర్ఎస్ మౌనంగా ఉండి పోయింది.

అటు పార్టీ అధినేత కేసీఆర్ నుంచి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరకు, హరీష్ నుండి తలసాని వరకు పార్టీలో కీలక నేతలుగా ఉన్న ఏ ఒక్కరు కవిత అరెస్టు విషయంలో బీజేపీ పై దూకుడుగా విమర్శలు చెయ్యలేదు, ఆమె విచారణ నుంచి అరెస్టు దాక పార్టీ నుండి ఎటువంటి నిరసన కార్యక్రమాలు జరపలేదు.

ADVERTISEMENT

పార్టీ అధినేతగా, కవిత తండ్రిగా కేసీఆర్ కనీసం కవిత అరెస్టు పై స్పందించనే లేదు. అలాగే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కవిత అన్నగా కేటీఆర్ కూడా బీజేపీ చర్యల పై ఎటువంటి ప్రకటనలు ఇవ్వలేదు. ఇక పార్టీ క్యాడర్ విషయానికొస్తే కవిత అరెస్టు ను బిఆర్ఎస్ క్యాడర్ చాల లైట్ తీసుకున్నారనే చెప్పాలి.

మరి ఇప్పుడు హరీష్ విషయంలో ఫోన్ టాపింగ్ కేసు అరెస్టు కాదు విచారణకు నోటీసులిచ్చినందుకే కేటీఆర్ మీడియా ముందుకొచ్చేసారు, హరీష్ పై రేవంత్ సర్కార్ కక్ష రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపిస్తున్నారు,

అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు విని ఇటువంటి చర్యలకు దిగుతున్న అధికారులను గుర్తుపెట్టుకుంటాం అంటూ అధికారుల పై కూడా బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఇక పార్టీ క్యాడర్ ఏకంగా సిట్ కార్యాలయం ముందు హరీష్ కు మద్దతుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు.

అంటే కవిత అరెస్టు విషయంలో కల్వకుంట్ల కుటుంబం నుంచి బిఆర్ఎస్ పార్టీ వరకు అందరు మౌన పోరాటాలు చేసి హరీష్ విషయానికొచ్చే సరికి విచారణకే బహిరంగ నిరసనలకు దిగుతున్నారు. ఇదేనా బిఆర్ఎస్ కవితకు చేసిన న్యాయం.? దీనిబట్టి కవిత ఆరోపించినట్టు బిఆర్ఎస్ కవిత విషయంలో సవతి ప్రేమ చూపించినట్టేనా.?

ADVERTISEMENT
Latest Stories