కేసులంటే మాకు భయం లేదు.. కానీ విచారణకు రాలేము!

Cases on YSR Congress Party Leaders

“మేము ప్రజల కోసం పోరాడుతున్నాం.. ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం.. అందుకే ప్రభుత్వం మాపై అక్రమ కేసులు నమోదు చేయిస్తోంది. మేము ఈ కేసులకు, అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదు.. ప్రజల కోసం, మా పార్టీ కోసం జైలుకి వెళ్ళడానికి మేము సిద్దం..” వైసీపీ నేతలు నిత్యం చెప్పే మాటలివి.

కట్ చేస్తే.. కొడాలి నానికి హటాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. చికిత్స కోసం హైదరాబాద్‌ అక్కడి నుంచి ముంబై ప్రయాణం. మొన్నటి దాకా నెల్లూరులో ప్రెస్‌మీట్లు పెట్టిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి హటాత్తుగా అదృశ్యమయ్యారు.

ADVERTISEMENT

ఆయన కోసం పోలీసులు నెల్లూరులో తిరుగుతుంటే, తాను హైదరాబాద్‌లో ఉగాది పండుగ జరుపుకుంటున్నానని తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టారు. పోలీసులు వెంటనే అక్కడకు వెళితే అక్కడా ఆయన కనబడలేదు.

కనుక మంగళవారం ఉదయం విచారణకు హాజరు కావలసిందిగా నోటీస్ అక్కడి సిబ్బంది చేతిలో పెట్టి తిరిగి వచ్చారు. ఒకవేళ ఆయన విచారణకు హాజరుకాకపోతే పోలీసులు అరెస్ట్‌ చేసే అవకాశం ఉంటుంది. కనుక జైలుకి వెళ్ళడానికి భయపడనని చెప్పిన ఆయన ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్‌ పెట్టుకున్నారు. దానిపై కోర్టు విచారణ జరుపబోతుంటే విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు నోటీస్ ఇవ్వడం అన్యాయమని వైసీపీ సొంత మీడియా తీర్మానించింది.

మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధకి చెందిన గోదాముల నుంచి రేషన్ బియ్యం మాయం కేసులో జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్‌ పొందారు. ఆమె బెయిల్‌ రద్దు చేయాలని పోలీసులు హైకోర్టులో పిటిషన్‌ వేయడం కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడటమే అని వైసీపీ సొంత మీడియా తీర్మానించింది.

మాజీ మంత్రి విడదల రజనిపై కూడా కేసు నమోదైంది. ఆమె కూడా చెప్పాల్సిన పంచ్ డైలాగ్స్ అన్నీ చెప్పేశారు. కనుక నేడో రేపో ఆమె కూడా జంప్ అయిపోవచ్చు. అప్పుడు పోలీసులు ఆమె కోసం గాలిస్తే అది కూడా రాజకీయ కక్ష సాధింపు కేటగిరీలొకే వచ్చేస్తుందని వేరే చెప్పక్కరలేదు.

ఇవన్నీ చూస్తున్నప్పుడు వైసీపీ నేతలు కేసులు, పోలీసులు, జైలు అంటే భయం లేదని ప్రగల్భాలు పలకడం దేనికి?కేసులు మొదలైతే అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం దేనికి? ముందస్తు బెయిల్‌ పిటిషన్ల కోసం కోర్టులని ఆశ్రయించడం దేనికి?ఓ రాజకీయ నాయకుడిపై కేసు నమోదు చేసిన తర్వాత అందరూ ఇలాగే జంప్ అయిపోతుంటారని తెలిసి ఉన్నప్పుడు పోలీసులు ముందే వారి కదలికలపై నిఘా ఉంచరు?తమ కళ్ళెదుట ఉన్నప్పుడు నోటీస్ ఇవ్వకుండా, అరెస్ట్‌ చేయకుండా పారిపోయిన తర్వాత వారి కోసం ఎందుకు గాలిస్తుంటారు? అనే సామాన్య ప్రజలకు సందేహాలకు సమాధానాలు దొరకవు.

ADVERTISEMENT
Latest Stories