జగనా ఏందిదీ..! యధా రాజా… తధా ప్రజా..!

YS jagan rejects amaravati invitation“విత్తు ఒకటైతే… చెట్టు మరొకటవుతుందా…” అన్న చందంగా వైసీపీ తయారవుతోందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. 16 మాసాలు జైలు గోడల మధ్య గడిపిన అనుభవం ఉన్న జగన్ మోహన్ రెడ్డి పార్టీ సభ్యులు కూడా ఒక్కొక్కరు అలాంటి అనుభవం కోసమే పరితపిస్తున్నట్లు కనబడుతున్నారు. ఏదొక వివాదం సృష్టించడం ద్వారా వార్తల్లో నిలవడం, ఆ తర్వాత న్యాయపరమైన చర్యలు… అంతిమంగా జైలు గోడలు… బెయిల్ కోసం ప్రయత్నాలు… ఇవే ఇటీవల కాలంలో వైసీపీ నాయకులు ఒక్కొక్కరు చవిచూస్తోంది.

కొన్నాళ్ళ క్రితం కృష్ణాజిల్లాలో గుడివాడ నియోజక వర్గంలో కొడాలి నాని సృష్టించిన వివాదం మరిచిపోక ముందే, మచిలీపట్టణం మాజీ ఎమ్మెల్యే పేర్ని నానికి కోర్టు రిమాండ్ విధించింది. అలా కొన్ని రోజులు జైల్లో గడిపిన తర్వాత బెయిల్ మంజూరు కావడంతో కాస్త సైలెంట్ అయ్యారు. ఈ వివాదం సమసిపోక ముందే రేణిగుంట విమానాశ్రయంలో ఓ అధికారి పై చెవిరెడ్డి భాస్కర రెడ్డి చేయి చేసుకున్నారంటూ మీడియా వర్గాలు హైలైట్ చేసాయి. అయితే ఈ విషయాన్ని ఖండించిన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర రెడ్డి మాటలు పచ్చి అబద్దాలని తేలిపోయింది.

ఎంపీ మిథున్ రెడ్డి, చెవిరెడ్డిలతో పాటు మొత్తం 16 మందిపై కేసు నమోదు చేసి విచారణ చేయగా, శ్రీకాళహస్తి కోర్టు చెవిరెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది. వరుసగా ముగ్గురు ఎమ్మెల్యేలు కేసుల్లో మునిగి తేలడం పార్టీ వర్గాలను, కార్యకర్తలను డీలా పరుస్తోంది. చట్టాలను తమ చేతుల్లోకి తీసుకుంటే ఎంతటి వారినైనా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివిధ సందర్భాల్లో స్పష్టం చేసారు.

ఏదొక విధంగా వార్తల్లో నిలిచి తమ ప్రాభవాన్ని చాటుకోవాలనే తాపత్రయంలో భాగంగానే వైసీపీ నేతలు ఈ విధంగా వ్యవహరిస్తున్నారన్న భావన పొలిటికల్ వర్గాల్లో కలుగుతోంది. బహుశా తమ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి కూడా ఇలాంటి విధానాలతోనే గుర్తింపు పొందడంతో, దానినే ఆ పార్టీ నాయకులు కూడా అనుసరిస్తున్నట్లు కనపడుతున్నారు.

“యధా రాజా… తధా ప్రజా..!” అంటే ఇదే కదూ..!

ADVERTISEMENT
Latest Stories