టాలీవుడ్ లో క్రేజీగా మారిన కాంభినేషన్స్ లో పూరీ జగన్నాధ్ – బాలకృష్ణ జోడి కూడా ఉంది. పూరీ చూపించే హీరోయిజం, పంచ్ డైలాగ్ లు బాలయ్య నోటి వెంటే వింటే ఫ్యాన్స్ కు పిచ్చెక్కిపోవడం ఖాయం అని చెప్పక తప్పదేమో. అంతలా అభిమానులు ఎదురుచూస్తున్న ఈ సినిమాలో నటించేందుకు తెలుగు నటీనటులకు పూరీ జగన్నాధ్ ఓ అవకాశం ఇచ్చారు. సాధారణంగా పెద్ద హీరోల సినిమాలలో కొత్త నటీనటులను తీసుకోవడం బహు అరుదుగా జరిగే విషయం.
కానీ, పూరీ ఆలోచనలు, తీరు సపరేట్ కదా! దీంతో తన సినిమా కావాల్సిన కాస్టింగ్ గురించి వివరాలు తెలియజేస్తూ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసారు. లీడ్ హీరోయిన్ దగ్గర నుండి సైడ్ క్యారెక్టర్స్ వరకు దాదాపుగా 12 మందికి కొత్తవారికి ఈ అవకాశం దక్కనుంది. టాలెంట్ ఉన్న నటీనటులకు ఇదొక ‘గోల్డెన్ ఆపర్చునుటీ’ అని చెప్పవచ్చు. పూరీ సినిమాలో హీరోకే మెయిన్ పాత్ర ఉన్నప్పటికీ, ఇతర పాత్రలు కూడా ప్రేక్షకుల్లోకి త్వరగా చొచ్చుకునిపోతాయి గనుక, తెలుగు ఆర్టిస్టులకు ఓ బంపర్ ఆఫర్ నే ప్రకటించారు పూరీ.




