అమరావతి రైల్వే వ్యవస్థపై చంద్రబాబు కీలక నిర్ణయం!

china-Railway-Engineering-Corporationకేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ‘బుల్లెట్ ట్రైన్’ మంత్రం జపిస్తుంటే… ఏపీలోని చంద్రబాబు నాయుడు సర్కారు మాత్రం… బుల్లెట్ రైళ్లొద్దు, హైస్పీడ్ రైళ్లు మాత్రం చాలు అంటోంది. ఇటీవల చైనా రైల్వేకు చెందిన అంతర్జాతీయ ప్రతినిధి బృందంతో చర్చలు జరిపిన రాష్ట్ర ప్రభుత్వం ‘హైస్పీడ్ రైలు’ వ్యవస్థ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి పటిష్ట రైలు వ్యవస్థను రూపొందించేందుకు ప్రభుత్వం సంకల్పించిన విషయం తెలిసిందే. తొలి దశలో భాగంగా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, విశాఖల నుంచి అమరావతికి రైల్వే నెట్ వర్క్ ను ఏర్పాటు చేయనున్న ప్రతిపాదనలకు చైనా రైల్వే వ్యవస్థ ముందుకొచ్చింది. మే మాసంలో అమరావతికి రానున్న చైనా రైల్వేకు చెందిన ఉన్నత స్థాయి బృందం తదుపరి కార్యాచరణను తెలుపుతుంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories