మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. నంద్యాలలో ఆయన బస చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద ఈరోజు ఉదయం 5 గంటలకు ఆయనను అరెస్ట్ చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు ఆయనకు తెలియజేశారు. అయితే కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతుండగా, ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు నాయుడు పేరు లేకపోయినా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని చంద్రబాబు నాయుడు ప్రశ్నించగా కోర్టులో సమాధానం చెపుతామని పోలీసులు జవాబు చెప్పారు. దీనిపై చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేయగా సీఐడీ పోలీసులు తాము ఖచ్చితంగా ప్రొసీజర్ ఫాలో అవుతున్నామని కనుక తమకు సహకరించాలని విజ్ఞప్తి చేసి ఆయనకు అక్కడే వైద్య పరీక్షలు చేయించారు.
చంద్రబాబు నాయుడుకి సీఆర్‌పీసీ సెక్షన్ 50(1) కింద నోటీస్ ఇచ్చి ఆయనపై సెక్షన్స్ 120 (బి), 166, 167, 418, 420, 465,468,201,109 రెడ్ విత్ 34, 37 కింద కేసు నమోదు చేసిన్నట్లు పోలీసులు తెలిపారు.



