నాలుగైదు రోజులలో చంద్రబాబు క్యాబినెట్ విస్తరణ?

Chandrababu N-aidu Cabinet Expansionటీడీపీ సీనియర్‌ నేత, శాసనమండలి ఛైర్మన్‌ ఎన్‌.ఎం.డి.ఫరూక్‌ పేరు చంద్రబాబు మలివిడత మంత్రివర్గ విస్తరణలో పరిశీలనలోకి తీసుకునే అవకాశముంది. రాయలసీమలో ముస్లింలు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో ఎన్నికల వేళ ఫరూక్‌ పేరును సైతం ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలిస్తున్నారు.

[m9ad]

ADVERTISEMENT

నాలుగైదు రోజులలో గానీ సెప్టెంబర్‌ ఆరో తేదీ నుంచి ప్రారంభమయ్యే శాసనసభ వర్షాకాల సమావేశాలు ముగిసిన తరువాత గాని మంత్రివర్గాన్ని స్వల్పంగా విస్తరించనున్నారు. మంత్రివర్గంలో ఖాళీగా మిగిలే మరో స్థానానికి ఎవర్ని ఎంపిక చేయాలన్న దానిపైనా ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు.

ఎస్టీ వర్గం నుంచి మంత్రివర్గంలోకి తీసుకోవటంలోనూ కొన్ని పరిమితులున్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తెదేపా నుంచి ఒక్కరే గెలుపొందగా… అయన పేరు పరిశీలనలో లేదు. వైకాపా నుంచి తెదేపాలో చేరిన వారి పేర్లు… మారిన రాజకీయ పరిణామాలతో పరిగణనలోకి తీసుకోవటం లేదు. ఫలితంగా ఏవర్గం నుంచి రెండో స్థానాన్ని భర్తీ చేస్తారన్న దానిపై సందిగ్ధత కొనసాగుతోంది.

ADVERTISEMENT
Latest Stories