కాపుల కోసం చంద్రబాబు తంటాలు!

Chandrababu naidu cabinetr meet kapu BC reservtionకాపుల్ని బీసీల్లో చేరుస్తామన్నది టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన కమిట్ మెంట్. ఆ మేరకు ఏపీ కేబినేట్ బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకుంది. అయితే, కాపుల్ని బీసీల్లో చేర్చడంవల్ల ప్రస్తుతం రిజర్వేషన్లు అనుభవిస్తున్న మిగతా సామాజిక వర్గాలకు నష్టం ఉండకూడదనేది ఓ వర్గం మాట. అయితే, మొదటి నుంచీ బీసీల పార్టీ అనేది టీడీపీకి ఉన్నపేరు.

ప్రస్తుతం ఉన్న బీసీలకు కోపం రాకుండా, నొప్పించకుండా ముందుకు వెళ్లాలన్నదే కీలకమైంది. అదనంగా కాపుల్ని చేర్చుకోవడం వల్ల ప్రస్తుత బీసీలకు వారి రిజర్వేషన్లలో ఎలాంటి కోతలు పడవని, ఇది అదనంగా ఇచ్చే రిజర్వేషన్ మాత్రమేనని చెప్పడం టీడీపీకి పెద్ద సవాలుగా మారింది. ప్రస్తుత బీసీలకు కోపం రాకుండా, వారిలో అసహనం పెరుగకుండా, కాపుల్ని సంతృప్తి పరచడానికి ఏపీ టీడీపీ నానా తంటాలు పడుతోంది. ఇదిలా ఉంటే, తాజాగా జరిగిన ఏపీ కేబినెట్‌ భేటీలో కాపులను బీసీల్లో చేర్చడంపై కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీ 9 నెలల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. బీసీలకు ఎలాంటి అన్యాయం జరగకుండా ముందుకు వెళ్లాలని నిర్ణయించారు.

ADVERTISEMENT
Latest Stories