ఇప్పుడు చంద్రబాబు ఓదార్పు యాత్ర?

Chandrababu -Naidu Odarpu- Yatraతెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఘోరపరాజయ భారంతో నిర్లిప్తతతో ఉన్న పార్టీలో ఉత్తేజం రేకేతించే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో ఈరోజు రేపు పర్యటిస్తారు. కుప్పం పర్యటన పూర్తి కాగానే ఆయన ఇటీవలే ఎన్నికల తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ జరిపిన దాడులలో చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తారు. ఈ వారం చంద్రబాబు షెడ్యూల్ ఫైనల్ అయ్యే అవకాశం ఉంది.

చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు పార్టీ తరపున ఐదేసి లక్షలు సాయం చెయ్యడానికి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మృతి అనంతరం చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించడానికి జగన్ కూడా ఓదార్పు యాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు చేసిన దాడులలో ఐదుగురు టీడీపీ కార్యకర్తలు చనిపోయినట్టు నిన్న డీజీపీని కలిసి ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు.

ADVERTISEMENT

మరోవైపు చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అధినేత పర్యటన సందర్భంగా టీడీపీ శ్రేణులు బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారం టీడీపీ, వైసీపీల మధ్య ఘర్షణకు దారితీసింది. గత ఐదేళ్లలో చంద్రబాబు హాయంలో జరిగిన ముఖ్య అభివృద్ధి కార్యక్రమాలు, వివరాలతో కూడిన డిజిటల్‌ బ్యానర్లు, ఫ్లెక్సీలను కుప్పం- పలమనేరు జాతీయ రహదారికి ఇరువైపులా ఏర్పాటు చేశారు. వాటిని తొలగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ వారు, తొలగించమని టీడీపీ వారు భీష్మించుకుని కూర్చోవడంతో పోలీసులు వచ్చి వారిని చెదరగొట్టాల్సి వచ్చింది.

ADVERTISEMENT
Latest Stories