‘సాక్షి’ పత్రిక ప్రజల ‘ఆస్తి’ – తప్పదు మరి!

We will take over Sakshi - Chandrababuఅవినీతి సొమ్ముతో పత్రిక స్థాపించి, ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని అనేక సందర్భాలలో ‘సాక్షి’ పత్రికపై తెలుగుదేశం నాయకులు ఆరోపణలు, విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇవన్నీ రాజకీయ విమర్శలలో భాగంగానే వ్యక్తమైనవి కావడంతో కేవలం వర్తమాన వార్తల వరకు మాత్రమే పరిమితమయ్యాయి. అయితే సాక్షాత్తూ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు ‘సాక్షి’ పత్రికను ఉద్దేశించి పరోక్షంగా చేసిన పలు వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమయ్యాయి.

‘రాష్ట్రంలో అవినీతి సొమ్మును స్వాధీనం చేసుకుంటాం, అవినీతి పత్రికను సొంతం చేసుకుంటాం, అది ప్రభుత్వ ఆస్తి ప్రజలకు చెందుతుంది’ అంటూ ‘సాక్షి’ పేరు ప్రస్తావించకుండా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మార్చి 28వ తేదీన హాజరు కావాలంటూ ఈడీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో, త్వరలోనే జగన్ ఆస్తుల ఎటాచ్ మెంట్ ఖాయమన్న విషయం పొలిటికల్ వర్గాల్లో హల్చల్ చేస్తోంది.

ADVERTISEMENT

ఈ సందర్భంగా మీడియా వర్గాలపై కూడా సెటైర్లు వేసారు చంద్రబాబు. ‘మీరు స్క్రిప్టు రాస్తే మేము నటిస్తామని, మామూలుగా అలాగే కదా జరుగుతోంది, ఏమైనా మీడియాకు ముందుగానే అన్నీ తెలిసిపోతాయని కదా’ అంటూ మీడియా ప్రతినిధులను ప్రశ్నించడంతో జర్నలిస్టులు నవ్వేశారు.

ADVERTISEMENT
Latest Stories