బావ కళ్ళలో ఆనందం కోసం ప్రయత్నిస్తే….

Chandrababu Naidu‘బావ కళ్ళలో ఆనందం కోసం…’ అనే ఈ డైలాగ్‌, ఆ తర్వాత బావ కళ్ళలో ఆనందం కోసం ప్రయత్నించిన ఆ వ్యక్తి ఏమయ్యాడో కూడా అందరికీ తెలుసు. ప్రస్తుతం ఏపీలో ఇదే జరుగుతోందని ప్రతిపక్షాలు, మేధావులు, రాజకీయ విశ్లేషకులు అందరూ అభిప్రాయపడుతున్నారు.

నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు అరికాళ్ళు వాచిపోయేలా కొట్టినా, గత నాలుగేళ్ళుగా టిడిపి నేతలను, కార్యకర్తలను అక్రమకేసులతో వేధించడం కేవలం రాజకీయకక్ష సాధింపు మాత్రమే కాదు… బావ కళ్ళలో ఆనందం కోసమే అని అందరూ అనుకొంటున్నదే.

ADVERTISEMENT

బావ కళ్ళలో ఆనందం కోసమే అన్నట్లు శాసనసభలో ముఖ్యమంత్రి జగన్‌ సాక్షిగా రాజకీయాలతో సంబందంలేని చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరిపై వైసీపీ సభ్యులు పోటీలు పడి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు కన్నీరు పెట్టుకొంటే బావ కళ్ళలో కనిపించింది ఆ ఆనందమే.

ఆ ఆనందం కోసమే నేడు చంద్రబాబు నాయుడుని అరెస్ట్‌ చేసి జైలుకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. బావ కళ్ళలో ఆనందం చూసేందుకు వైసీపీ నేతలు, ఉన్నతాధికారులు అందరూ పోటీలు పడుతున్నారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు.

ఇదివరకు తమిళనాడులో ఇటువంటి విషసంస్కృతి ఉండేది. నిండు శాసనసభలో అధికార డీఎంకె సభ్యులు దివంగత ముఖ్యమంత్రి జయలలిత చీర పట్టుకొని లాగారు. అప్పుడే ఆమె మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాతే శాసనసభలో అడుగుపెడతానని, తనను ఇంత ఘోరంగా అవమానించిన కరుణానిధిపై ప్రతీకారం తీర్చుకొంటానని శపధం చేసి నెరవేర్చుకొన్నారు కూడా.

ఆ విష సంస్కృతే ఇప్పుడు ఏపీలోకి వ్యాపించింది. టిడిపి అధికారంలోకి వస్తే జగన్‌తో వైసీపీ నేతలతో సహా తమను వేదిస్తున్న పోలీస్ అధికారులకు, ఇతర అధికారులందరిపై కటిన చర్యలు తప్పవని చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌తో సహా టిడిపి నేతలు పదేపదే హెచ్చరిస్తుండటం గమనిస్తే భవిష్యత్‌లో ప్రతీకార రాజకీయాలు కొనసాగబోతున్నాయని స్పష్టం అవుతోంది.

అధికారం శాస్వితం కాదనే విషయాన్ని గ్రహించి లభించిన గొప్ప అవకాశాన్ని వినియోగించుకొని ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి కట్టుబడి పాలన చేస్తూ రాష్ట్రాభివృద్ధికి, ప్రజాసంక్షేమానికి కృషి చేస్తే అందరూ హర్షించేవారు. ప్రజలే మళ్ళీ మళ్ళీ పట్టం కట్టేవారు. కానీ ఈవిదంగా కక్షపూరిత రాజకీయాలతో రాష్ట్రంలో ప్రత్యర్ధులను కట్టడి చేయాలనుకొంటే, ప్రజలే అటువంటి పార్టీలను, నేతలను తిస్కరిస్తారని గ్రహిస్తే మంచిది.

ఈరోజు వైసీపీ వ్యవహరిస్తునట్లే రేపు టిడిపి అధికారంలోకి వస్తే చేయకుండా ఉంటుందా? చేస్తే అప్పుడు తమ పరిస్థితి ఏమిటని బావ కళ్ళలో ఆనందం కోసం ప్రయత్నిస్తున్న ప్రతీ ఒక్కరూ ఆలోచించుకొంటే మంచిది.

ADVERTISEMENT
Latest Stories