చంద్రబాబుకు తొలగిన కుటుంబ శత్రుశేషం

Chandrababu-Naidu-Coming-in-the-Path-of-KCR's-Federal--Frontతెలుగుదేశం పార్టీ కనీవినీ ఎరుగని ఓటమిని చవి చూసింది. ఓడిపోవడం వరకు సరే గానీ ఇంత ఘోరమైన ఓటమికి కారణం ఏంటో ఆ పార్టీకి అంతుచిక్కడం లేదు. 175 సీట్లు కలిగిన అసెంబ్లీలో ఇప్పుడు ఆ పార్టీకి కేవలం 23 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ క్రమంలో ఎన్నో కంచుకోటలు కూలిపోయాయి మంత్రులు సైతం ఓడిపోయారు. అయితే ఇంత విధ్వంసంలో కూడా చంద్రబాబు నాయుడు ఒక చిన్న శుభవార్త అందింది. రాజకీయంగా ఆయన మీద వైరంతో ఉండే దగ్గుబాటి కుటుంబం నామరూపాలు లేకుండా పోయింది.

ఎన్టీఆర్ ను పదవీచితుని చెయ్యడంతో చంద్రబాబుకు సహకరించారు ఆయన. అయితే ఆ తరువాత టీడీపీలో సరైన గౌరవం దక్కలేదని కాంగ్రెస్ కు వెళ్లిపోయారు. అప్పటి నుండి ఆయనకు చంద్రబాబు బద్ద శత్రువు. ప్రకాశం జిల్లా పర్చూరు స్థానం నుంచి దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైకాపా నుంచి బరిలోకి దిగారు. వాస్తవానికి ఈ సీటును ఆయన కుమారుడు హితేష్‌కు ఆశించినా.. పౌరసత్వం విషయంలో తలెత్తిన సమస్యతో సాధ్యపడలేదు. కొడుకు సీటు కోసం జగన్ వద్దకు వెళ్ళిన వెంకటేశ్వరరావునే చివరికి బరిలోకి దిగారు.

ADVERTISEMENT

అయితే ఆయన టీడీపీ అభ్యర్థి ఏలూరు సాంబశివరావు చేతిలో ఓటమి పాలయ్యారు. దగ్గుబాటి గెలిస్తే ఆయనను స్పీకర్ ను చేసి చంద్రబాబు చేత అధ్యక్షా అనిపించాలన్న జగన్ కోరిక తీరలేదు. ఆయన సతీమణి పురందేశ్వరి మాత్రం బీజేపీలో ఉండి విశాఖపట్నం ఎంపీగా పోటీ చేశారు. గతంలో ఎక్కడ నుండే ప్రాతినిధ్యం వహించి కేంద్ర మంత్రిగా చేసిన ఆమెకు ఈ సారి కనీసం డిపాజిట్ కూడా రాలేదు. దీనితో చంద్రబాబుకు కుటుంబ శత్రుశేషం లేకుండా పోయింది. మోడీ గానీ జగన్ గానీ వారిని చంద్రబాబు మీద ఉన్న కసితో పనిగట్టుకుని ప్రోత్సహిస్తే తప్ప రాజకీయంగా వారి చరిత్ర సమాప్తం ఐపోయినట్టే.

ADVERTISEMENT
Latest Stories