ఈ బాబు ఎప్పుడూ ఇంతే… ఈ జన్మలో మారడు!

Chandrababu Naidu discussing quantum computing and facing political criticism in 2025

సినీ పరిశ్రమలో ఒకటి రెండు హిట్స్ కొట్టిన హీరో ‘బాబు’గా మారిపోతాడని ఓ డిస్ట్రిబ్యూటర్ కొత్త విషయం చెప్పారు. కానీ రాజకీయాలలో ఎంతమంది ఎన్ని హిట్స్ కొట్టినా ‘బాబు’ అంటే ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు మాత్రమే.

70 వేలో 80 వేలో పుస్తకాలు చదివిన రాజకీయ మేధావులు కూడా బాబు పేరు చెప్పుకునే రాజకీయాలు చేసుకుని బ్రతుకుతుంటారు. అవలీలగా మరో ముప్పై ఏళ్ళు రాజకీయాలలో బ్యాటింగ్ చేయగాలని చెప్పుకునే మన ప్రియతమ యువనేతలు కూడా బాబు పేరు చెప్పుకునే రాజకీయాలు చేసుకుంటారు.

ADVERTISEMENT

అందరూ ఇలా తన పేరు చెప్పుకొని రాజకీయాలు చేసుకుంటుంటే ఈ బాబుకి ఇవేమీ పట్టవు. ఎంత సేపు ఎవరికీ అర్థం కాని మాటలు మాట్లాడుతుంటారు. గంటా అరగంట, కోడి గుడ్డు… గురించి గట్టిగా ఒక్క నిమిషం కూడా మాట్లాడలేరు! కానీ ఎవరికీ అర్థం కాదు కదా అని ‘క్వాంటం కంప్యూటర్’ అంటూ ఏదేదో మాట్లాడేస్తుంటారు.

ఈయన ఎప్పుడూ ఇంతేనా? వర్తమానంలో తక్కువ భవిష్యత్‌లో ఎక్కువ జీవిస్తుంటారా?అనే డౌట్ కూడా వస్తుంటుంది. 2025లో ‘ఏఐ ఏఐ’ అంటూ కాకిలా గోలగోల చేస్తూ మొత్తం మీద ఆ రోగం అందరికీ అంటించేశారు. ఇప్పుడు 2026లో ‘క్వాంటం కంప్యూటింగ్’ అనే కొత్త రోగం అంటించేందుకు సిద్ధం అవుతున్నారు.

చైనా వాళ్ళు నాడు ల్యాబులో కరోనా సృష్టించి యావత్ ప్రపంచానికి అంటించేసినట్లు, “మేము కూడా అమరావతిలో ‘క్వాంటం కంప్యూటర్లు, ఆ వ్యవస్థ” తయారు చేసి యావత్ ప్రపంచానికి అంటించేస్తామని ఏమాత్రం సిగ్గుపడకుండా చెపుతున్న ఈ బాబుని ఏమనాలి?

ఆయన ఎవరికీ అర్థం కాని క్వాంటం కంప్యూటర్ల గురించి మాట్లాడుతుంటే, మనమేమో ‘రప్పా రప్పా’ జనానికి అర్ధమయ్యే భాషలో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషం. ఎంతైనా మన మాతృభాష రప్పారప్పాని కాపాడుకోవడం మన బాధ్యతే కదా?

ఈ బాబుకి ఇలాంటి మాతృభాష లేదు… కనుక ఇంత అభిమానమూ ఉండదు అంతే! అందుకు అయన సిగ్గుపడాలి కానీ రప్పా రప్పా అని మాతృభాషలో మాట్లాడుతున్న మనమెందుకు సిగ్గుపడాలి?

ADVERTISEMENT
Latest Stories