చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం

Chandrayaan 3ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం అయ్యింది. బుదవారం సాయంత్రం సరిగ్గా 5.47 గంటలకు విక్రమ్ ల్యాండర్ వేగం తగ్గించుకొంటూ సాగి అన్ని సవ్యంగా ఉన్నాయని నిర్దారించుకొన్న తర్వాత సరిగ్గా 6.04 గంటలకు చంద్రుడి దక్షిణధృవంలో ఉపరితలంపై దిగింది.

ఖచ్చితంగా 17 నిమిషాలపాటు 1. రఫ్ బ్రేకింగ్, 2. అల్టిట్యూడ్ హోల్డ్, 3. ఫైన్ బ్రేకింగ్, 4. టెర్మినల్ డిసెంట్ నాలుగు దశలలో సాగిన ఈ ల్యాండింగ్ ప్రక్రియ తీవ్ర ఉత్కంఠ కలిగించినప్పటికీ ప్రతీ దశ చాలా సజావుగా సాగుతూ చంద్రుడి దక్షిణధ్రువంలో ఉపరితలంపై ముందుగా నిర్దేశించిన ప్రదేశంలోనే విక్రమ్ ల్యాండర్ కిందకు దిగింది. దీంతో చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్ చేసిన అమెరికా, రష్యా, చైనా దేశాల సరసన భారత్‌ని కూడా నిలిపారు మన ఇస్రో శాస్త్రవేత్తలు.

ADVERTISEMENT

ఈ సాఫ్ట్‌ ల్యాండింగ్ ప్రక్రియను ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు తిలకించారు. చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం అవడంతో ఇస్రో శాస్త్రవేత్తలు, అధికారులు, సిబ్బంది సంతోషంతో పొంగిపోతూ ఒకరికొకరు అభినందనలు తెలుపుకొంటున్నారు.

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులు, వివిద రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, వివిద రంగాలకు చెందిన ప్రముఖులు ఇస్రో శాస్త్రవేతలను అభినందిస్తూ సోషల్ మీడియాలో సందేశాలు పెడుతున్నారు.

వివిద దేశాధిపతులు, వివిద దేశాలకు చెందిన శాస్త్రత్తలు, ప్రముఖులు కూడా ఇస్రో శ్రాస్త్రవేత్తలను అభినందనలతో ముంచెత్తుతున్నారు. చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం అవ్వాలని కోరుతూ దేశవ్యాప్తంగా వివిద మతాలకు చెందిన ప్రజలు ప్రత్యేక పూజలు, ప్రార్ధనలు చేస్తున్నారు. చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం అవుతుందనే గట్టి నమ్మకంతో దేశవ్యాప్తంగా కోట్లాదిమంది భారతీయులు, ముందే పటాసులు, స్వీట్లు, జాతీయజెండాలు సిద్దంగా ఉంచుకొని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. చంద్రుడి ఉపరితలం మీద విక్రమ్ విజయవంతంగా దిగిందని తెలియగానే దేశవ్యాప్తంగా సంబరాలు మొదలైపోయాయి. దేశవ్యాప్తంగా పటాసులు పేల్చుతూ, మిఠాయిలు పంచుకొంటూ చిన్నా పెద్ద ఆనందోత్సవాలలో మునిగిపోయారు. దీనిని బట్టి దేశ ప్రజలు చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం అవ్వాలని ఎంతగా తహతహలాడుతున్నారో అర్దం అవుతోంది.

ADVERTISEMENT
Latest Stories