ఈ హాట్ బ్యూటీ నోరూరిస్తోంది!

Charmy Kaurసిల్వర్ స్క్రీన్ పై హాట్ హాట్ అందాలను ఒలకబోసే సిస్లేజింగ్ బ్యూటీ ఛార్మి, రంజాన్ పర్వదినం సందర్భంగా చికెన్ బిర్యానీతో వీక్షకులను ఊరిస్తోంది. ఎప్పుడూ తన భారీ సౌందర్యాలతో చూపులు తన వైపుకు తిప్పుకునేలా చేసే ఈ ముద్దుగుమ్మ, ఈ సారి మాత్రం చికెన్ బిర్యానీతో ప్రేక్షకుల నోరూరిస్తోంది. “ఈ రోజు నా ఆహారం ఇదే అంటూ” ఓ పెద్ద ప్లేటు నిండా ఉన్న చికెన్‌ బిర్యానీతో తాను దిగిన ఫోటోను పోస్ట్ చేసింది ఛార్మి.

ప్లేట్ నిండా స్పైసీ స్పైసీగా కనపడుతున్న ఆ బిర్యానీ ఆకర్షించకుండా ఉంటుందా! అంతకుముందు బిర్యానీ మేకింగ్ వీడియోను కూడా పోస్ట్ చేసింది. రంజాన్ పర్వదినాన్ని ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేసుకుంటున్నట్లుగా ఈ సందర్భంగా చెప్పకనే చెప్పింది. ముస్లిం సోదరులకు ఈ రోజు ప్రత్యేక వంటకాలు కావాలంటే… ఛార్మి ఇంటికి విచ్చేయండి… అనే విధంగా రంజాన్ పార్టీ చేసుకుంటోంది ఈ హాట్ బ్యూటీ.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories