మళ్ళీ హాట్ టాపిక్ గా “చెప్పను బ్రదర్?”

Cheppanu Brother , Cheppanu Brother Back, Cheppanu Brother Back News, Cheppanu Brother Back Media, Cheppanu Brother Back, Cheppanu Brother Back Allu Arjun‘సరైనోడు’ సక్సెస్ పుణ్యమా అంటూ… పవన్ కళ్యాణ్ అభిమానులు చేసిన రచ్చకు… అల్లు అర్జున్ చేసిన ‘చెప్పను బ్రదర్’ అన్న కామెంట్ సోషల్ మీడియాను ఒక ఊపు ఊపిన విషయం తెలిసిందే. ఈ డైలాగ్ ను తాజాగా విడుదలైన ‘సెల్ఫీ రాజా’ సినిమా క్లైమాక్స్ ఎపిసోడ్ లో బీభత్సంగా వాడేసి ప్రేక్షకులకు నవ్వు తెప్పించే ప్రయత్నం చేసారు. అంతలా సినీ ప్రేక్షకుల్లోకి చొచ్చుకుపోయిన ఈ డైలాగ్ త్వరలో అందరి నోట పలికించేందుకు సన్నద్దమవుతున్నట్లుగా సమాచారం.

“చెప్పను బ్రదర్” అనే మాటను ఓ సినిమా టైటిల్ గా ఫిల్మ్ ఛాంబర్ లో తాజాగా నమోదు చేయడం హాట్ టాపిక్ అయ్యింది. మరి ఈ సినిమాలో నటించే హీరో ఎవరు? బన్నీకి కౌంటర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తారా? లేక బన్నీ డైలాగ్ ని కామెడీగా మార్చేస్తారా? వంటి అనేక ప్రశ్నలకు సమాధానం కావాలంటే మరికొంత సమయం పట్టేలా కనపడుతోంది. మొత్తమ్మీద బన్నీ చెప్పిన ఓ చిన్న మాట ఎంతటి సంచలనానికి దారి తీసిందో అంటూ సినీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories