మే డే పర్ ఫెక్ట్ పోస్టర్!

Chinna Babu First Look Response
కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మే డేన చాలా శుభాకాంక్షల వెల్లువలు వచ్చిపడ్డాయి. రాజకీయ నాయకుల నుండి మొదలైన ఈ శుభాకాంక్షలలో సినిమా పోస్టర్లు కూడా చాలా వచ్చాయి. అయితే వాటిల్లో మే డే పర్ ఫెక్ట్ పోస్టర్ గా నిలిచింది మాత్రం, తమిళ హీరో కార్తీ తెలిపిన “చినబాబు” శుభాకాంక్షలు.

కార్మికులతో కలిసిపోయి మెడలో తుండుగుడ్డ వేసుకుని ఉన్న కార్తీ పోస్టర్ మే డేకు సరిగ్గా సరిపోయింది. పాండిరాజ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో కార్తీ సరసన సాయేషా సైగల్ హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలో ఈ సినిమా టీజర్ ను విడుదల చేయనున్నట్లు ఈ పోస్టర్ లో చిత్ర యూనిట్ ధృవీకరించింది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories