చిరంజీవి ఆలోచనలో పడ్డారా? తెలివిగా అలోచించారా?

Chiranjeevi-Tollywoodమెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు జరుపుకున్నారు. భోళా శంకర్ వంటి డిజాస్టర్ తరువాత వెంటనే వచ్చిన పుట్టినరోజు కాబట్టి వాతావరణం కాస్త స్తబ్దుగానే ఉంది. చిరంజీవి ఇప్పటికే రెండు సినిమాలు ఒకే చేశారు వాటి అధికారిక ప్రకటనలు ఈరోజున ప్లాన్ చేశారు.

అందులో ఒకటి తన కుమార్తెకు ఇంకోటి యూవీ క్రియేషన్స్ కు. యూవీ క్రియేషన్స్ సినిమాకు సంబంధించిన ప్రకటన బానే వచ్చేసింది. కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు. ఏదో డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారు అనిపించారు ఫ్యాన్స్ హ్యాపీ.

ADVERTISEMENT

ఇక సుష్మిత కొణిదెల సినిమా విషయంలో మాత్రం అటుఇటుగా అనౌన్స్మెంట్ ఇవ్వడం గమనార్హం. డైరెక్టర్ పేరు ఇతర వివరాలు ఇవ్వకుండా ఒక పోస్టర్ విడుదల చేశారు. అయితే వెంటనే చేసే సినిమా అదే అంటూ #Mega156 అంటూ నెంబర్ ఇచ్చారు.

అయితే ఇమ్మీడియేట్ గా చెయ్యబోయే సినిమా ప్రకటన చెయ్యకుండా తరువాతి సినిమా ఎందుకు ప్రకటించినట్టు?

భోళా శంకర్ తరువాత చిరంజీవి క్రింజ్ సినిమాలు చెయ్యకూడదని, అటువంటి డైరెక్టర్లతో పని చెయ్యకూడదని ఒత్తిడి పెరిగింది.

#Mega154 సినిమా కంప్లీట్ కామెడీ సినిమా…. చిరంజీవికి రొమాంటిక్ ట్రాక్ కూడా ఉంటుంది. కళ్యాణ్ కృష్ణ యావరేజ్ దర్శకుడు. ఈ టైంలో ఆ అనౌన్స్మెంట్ రిస్క్ అని చిరంజీవి అనుకుని ఆ అనౌన్స్మెంట్ ని ఆపారు.

అయితే కొందరు ఫ్యాన్స్, ఆడియన్స్ కోపం తగ్గాకా సైలెంట్ గా సినిమా మొదలుపెట్టేస్తారని అంటున్నారు. ఇంకొంత మంది చిరంజీవి సినిమా చెయ్యడం పై ఆలోచనలో పడ్డారా అని అంటున్నారు.

సొంత కుమార్తె ప్రొడక్షన్ కాకపోతే అసలు సినిమా అప్డేట్ అనేదే ఇవ్వడం మానేసేవారు. అయితే సుష్మితకు ఇమ్మీడియేట్ గా సినిమా చెయ్యాలని చిరంజీవి స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారు. అందుకే నెక్స్ట్ సినిమా నీకే అని భరోసా ఇవ్వడం కోసం ప్రాజెక్ట్ నెంబర్ ఇచ్చేశారు .

ప్రెషర్ తట్టుకోలేక అనౌన్స్మెంట్ టెంపరరీ గా ఆపారా లేక నిజంగా ఆలోచన లో పడ్డారా అనేది తేలాలి. M9.News కు ఉన్న సమాచారం ప్రకారం ఈ కథ చిరంజీవి కి నచ్చింది. ఆ కాంబినేషన్ మెటీరియలైజ్ అయ్యే అవకాశాలే ఎక్కువ.

ADVERTISEMENT
Latest Stories