నా జీవితంలో తీరని లోటది – చిరంజీవి!

Chiranjeevi aout SVRమహానటుడు ఎస్వీ రంగారావు పుట్టినరోజు సందర్భంగా ఓ మీడియా సంస్థతో మాట్లాడిన మెగాస్టార్ చిరంజీవి, ఆయన గురించి మాట్లాడేంత స్థాయి, అర్హత తనకు ఉన్నాయని తాను అనుకోవడం లేదని వినమ్రంగా చెప్పారు. ఎస్వీఆర్ చలన చిత్ర రంగాన్ని ఏలుతున్న రోజుల్లో తాము చిన్న పిల్లలమని, బహుశా ఏడో తరగతో, ఎనిమిదో తరగతో చదువుతున్నానని, ఆ సమయంలో తన తండ్రి వెంకట్రావు ‘జగత్ కిలాడీలు’, ‘జగత్ జెట్టీలు’ సినిమాలలో చిన్నచిన్న పాత్రలు వేశారని చెప్పారు.

‘జగత్ కిలాడీలు’ చిత్రంలో ఎస్వీఆర్ తో కలసి నటించారని… ఆయన గురించిన అనుభవాలను నాన్న చెబుతుంటే మైమరచి వినేవాడినని తెలిపారు. ఆ తర్వాత ఆయనపై అభిమానం రోజురోజుకూ పెరుగుతూ వచ్చిందని, ఎస్వీఆర్ తో కలసి నటించే అదృష్టం తనకు కలగకపోయినప్పటికీ… ఆయన ఆశీస్సులు తీసుకోవాలని అనుకున్నానని… తాను సినిమాల్లోకి రావాలని అనుకునే సమయానికే ఆయన మరణించారని ఆవేదన వ్యక్తం చేసిన మెగాస్టార్, తన జీవితంలో ఇదొక తీరని లోటుగా అభివర్ణించారు.

ADVERTISEMENT

ఎస్వీఆర్ అంటే సహనటులు ఎందుకు టెన్షన్ పడతారంటే… ఒకసారి నటించినట్టు మరోసారి ఆయన నటించరని, ఆయన స్పీడ్ ను అందుకోవడం సహనటులకు చాలా కష్టమని చెప్పారు. మహానటుడైన ఎస్వీఆర్ కు ఎలాంటి పురస్కారం దక్కకపోవడం బాధగా ఉందని… అయితే అందుకు సంబంధించిన కారణాల గురించి తాను మాట్లాడనని, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇచ్చి ఆయనను గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎస్వీఆర్ కు ఈ అవార్డు వచ్చేలా కృషి చేయాలని విన్నవించుకుంటున్నానని చెప్పారు.

ADVERTISEMENT
Latest Stories