తుపాకి పట్టబోతున్న చిరంజీవి?

Chiranjeevi dual role in koratala siva movieమెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వేగంగా జరుగుతుంది. సైరా పూర్తి కాగానే ఈ చిత్రంపై ఫోకస్ పెట్టనున్నాడు మెగాస్టార్. మరోవైపు కొరటాల కూడా ఈ చిత్రం కోసం ఏడాదిన్నరగా వేచి చూస్తున్నాడు. భరత్ అనే నేను తర్వాత కొరటాల మరో సినిమా ఒప్పుకోలేదు. ఆగస్ట్ 22న చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం ముహూర్తం ఉంటుందని తెలుస్తుంది. అక్టోబరు నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందని సమాచారం.

ADVERTISEMENT

ఇక కథ విషయానికి వస్తే…. ఈ సినిమా స్టోరీకి నక్సల్ బ్యాక్ డ్రాప్ ఉంటుందని సమాచారం. రెండు విభిన్నమైన పాత్రలలో చిరంజీవి కనిపించబోతున్నారట. గోవింద్ అనే యువకుడు పాత్రలో ఆచార్య అనే నడివయస్కుడి పాత్రలో చిరంజీవి కనిపించబోతున్నారట. ఆచార్య పాత్రలో చిరంజీవి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కనిపిస్తారట. ఈ చిత్ర తొలి షెడ్యూల్ శ్రీకాకుళం జిల్లా పలాసలో మొదలు పెట్టనున్నారని తెలుస్తుంది. ప్రజారాజ్యం ఎన్నికల సమయంలో అక్కడికి వెళ్లిన మెగాస్టార్ మళ్లీ ఇన్నేళ్లకు అక్కడికి షూటింగ్ కోసం వెళ్లనున్నాడు.

చిరంజీవి సినిమాను తనయుడు రామ్ చరణ్ నిర్మించనున్నాడు. ఈ సినిమాను ఉగాది సంద‌ర్భంగా విడుద‌ల కానుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా అనేక పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకూ ఎవరిని అధికారికంగా ధ్రువీకరించలేదు. కొరటాల, చిరు చిత్రం గురించి అన్ని విషయాలు వివరంగా తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ చిత్రం షూటింగ్ పూర్తి కాగానే కొరటాల రామ్ చరణ్ తో కూడా ఒక సినిమా చెయ్యబోతున్నట్టు సమాచారం.

ADVERTISEMENT
Latest Stories