చంద్రబాబు ఆకస్మిక ఢిల్లీ పర్యటన, అమిత్ షాతో భేటీ…అందుకేనా?

Chandrababu Naidu Meets Amit Shah in Delhi

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆకస్మికంగా శనివారం ఢిల్లీ బయలుదేరి వెళ్ళి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.

అమరావతి, పోలవరం పనులకు నిధులు, పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులు, విభజన హామీల అమలు గురించి ఆయనతో చర్చించినట్లు వార్తలు వచ్చాయి.

ADVERTISEMENT

వేరే సమయంలో ఇలాంటి వార్తలు నమ్మశక్యంగా ఉంటాయి. కానీ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ఊహించని స్థాయిలో అల్లర్లు, విధ్వంసం జరిగాయి. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి.

ఈ పరిణామాలపై సీఎం చంద్రబాబు నాయుడు శనివారం మీడియా సమావేశం నిర్వహించి వైసీపీ అరాచకాలపై నిప్పులు చెరిగారు.

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిది ‘క్రిమినల్ మెంటాలిటీ’, ఆయన చేసేవి ’క్రిమినల్ పాలిటిక్స్’ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఎందుకో తేలికగానే ఊహించవచ్చు.

ఈ అల్లర్లపై అమిత్ షాకు వివరణ ఇచ్చుకునేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళారంటూ వైసీపీ సొంత మీడియా అసలు విషయాన్ని ‘తమ కోణంలో’ చెప్పేసింది.

కానీ తమ అరాచకాల గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు పిర్యాదు చేసేందుకే సిఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళారని వైసీపీ బాగానే పసిగట్టినట్లు అర్ధమవుతోంది.

పెద్దగా రాజకీయ జ్ఞానం లేనివారు అమరావతి, పోలవరం వార్తలు చదువుకొని సంతోషపడవచ్చు. కానీ చంద్రబాబు-అమిత్ షాల భేటీతో వైసీపీ గుండెల్లో గుబులు మొదలయ్యే ఉంటుంది.

ముఖ్యంగా ఈ ఎన్నికల్లో బిజేపి అభ్యర్ధులు, ఆ పార్టీ శ్రేణులు కూడా వైసీపీ తీరుతో చాలా ఇబ్బంది పడ్డాయి. కనుక ఏపీ బీజేపీ నుంచి కూడా అమిత్ షాకు ఫీడ్ బ్యాక్ వచ్చే ఉంటుంది.

కనుక త్వరలో వైసీపీ విషయంలో ఏదైనా అనూహ్య పరిణామాలు జరిగినా ఆశ్చర్యం లేదు. ఒకవేళ ఇప్పుడే తొందరపాటు ప్రదర్శించడం సరైనది కాదని అమిత్ షా భావిస్తే ఏమీ జరగక పోవచ్చు.

అప్పుడు, రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌తో సిఎం చంద్రబాబు నాయుడు భేటీ, ఏపీకి కొత్త రైళ్ళు, రైల్వే ప్రాజెక్టుల వార్తలు ఉండనే ఉన్నాయి.

ADVERTISEMENT
Latest Stories