ప్చ్… తలపట్టుకుంటున్న మెగా ఫ్యాన్స్..!

Chiranjeevi Khaidi No 150 TRP Ratingsఈ ఏడాది సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ కం బ్యాక్ మూవీకి మెగా అభిమానులు బ్రహ్మరధం పట్టారు. మాస్ మెగా ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల బుల్లితెరపై ప్రసారమైంది. బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించడంతో బుల్లితెరపై కూడా బంపర్ హిట్ అవుతుందన్న అంచనాలు వేసారు. అందుకు అనుగుణంగానే బుల్లితెరపై ఈ సినిమాకు జన నీరాజనం పలికారని సోషల్ మీడియా వేదికగా మెగా ఔత్సాహికులు పని కట్టుకుని భారీ ప్రచారం చేసారు.

నిజం నిలకడ మీద తెలుస్తుందన్న విధంగా తాజాగా “ఖైదీ నంబర్ 150” టీఆర్పీ రేటింగ్స్ బయటకు రావడంతో… నాడు భారీ ప్రచారం నిర్వహించిన మెగా వీరాభిమనులంతా… ప్రస్తుతం ‘ష్……’ అంటూ సైలెంట్ అయిపోయారు. ఆదివారం నాడు ప్రసారమైన ఈ సినిమా కేవలం 6.93 రేటింగ్స్ ను మాత్రమే అందుకోగలిగింది. దీంతో బుల్లితెర ప్రేక్షకులు ఈ రొటీన్ మూస సినిమాను తిప్పికొట్టారని ఖరారైంది. అయితే చిరు రీ ఎంట్రీ మూవీకి ఇంత దారుణమైన రేటింగ్స్ వస్తాయని మాత్రం ఎవరూ అంచనా వేయలేదు.

ADVERTISEMENT

ప్రిన్స్ మహేష్ బాబు నటించిన “బ్రహ్మోత్సవం” సినిమా కేవలం 7.52 రేటింగ్స్ ను అందుకోవడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా తీవ్రంగా నిరాశ పరచడంతో, అదే స్థాయిలో స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులు కూడా తీర్పు ఇచ్చారని విశ్లేషణలు చేసారు. అయితే చిరు సినిమా మంచి వసూళ్ళనే రాబట్టింది గానీ, విమర్శకుల ప్రశంసలను అందుకోవడంలో విఫలమైంది. చిరు సినిమా కంటే నాగ్ ‘ఓం నమో వేంకటేశాయ’ (9.81), నాని ‘నేను లోకల్’ (9.28) ఉత్తమమైన రేటింగ్స్ ను సొంతం చేసుకోవడం విశేషం.

అయితే అట్టడుగున బాలకృష్ణ “గౌతమీపుత్ర శాతకర్ణి” సినిమా 5.52 రేటింగ్స్ లో ఉన్నప్పటికీ, సహజంగా బాలయ్య సినిమాలకు బుల్లితెర ఫ్యామిలీ ప్రేక్షకుల ఆదరణ ఉండదన్న విషయం తెలిసిందే. దీంతో అంత తక్కువ నమోదైనప్పటికీ ఎవరూ పెద్దగా ఆశ్చర్యపడలేదు. కానీ చిరుకున్న ఫాలోయింగ్ కు, అభిమాన ప్రేక్షకుల స్థాయికి 6.93 అంటే… అది అతి దారుణమైన పరాజయంగా భావించవచ్చు. అంతే… ప్రేక్షకులు ఎప్పుడు ఎవరికి ఎలాంటి తీర్పును అందిస్తారో… ఎలాంటి షాక్ ఇస్తారో… ఎవరికీ తెలియదు.

ADVERTISEMENT
Latest Stories