మెగా బ్రదర్స్‌లో ఎవరు సినీ పంచాయితీని పరిష్కరిస్తారో?

Chiranjeevi and Pawan Kalyan discussing issues related to the Telugu film industry

తెలుగు సినీ పరిశ్రమలో టికెట్స్ ఆదాయం పంచుకునే విషయంలో నిర్మాతలకు, తెలంగాణలో ఎగ్జిబిటర్స్ (సింగిల్ స్క్రీన్ థియేటర్స్) మద్య ప్రతిష్టంభన అలాగే ఉంది. కనుక మూడు రోజుల క్రితం కొందరు నిర్మాతలు రాజమహేంద్రవరంలో ఏపీ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యి సమస్యలు చెప్పుకున్నారు.

దీని కోసం రాష్ట్ర ప్రభుత్వమే విధానం ప్రకటించాలని వారు కోరారు. అలాగే సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న మరికొన్ని సమస్యలని కూడా పవన్ కళ్యాణ్‌ దృష్టికి తీసుకువెళ్ళారు. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తరపున సహాయసహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ సానుకూలంగా స్పందించారు.

ADVERTISEMENT

ఆ తర్వాత వారితో పాటు పలువురు నిర్మాతలు, నిర్మాతలు, తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు హైదరాబాద్‌లో మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్ళి ఈ సమస్య పరిష్కరించవలసిందిగా కోరారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు.

చిరంజీవి సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా ఉన్నారు. కనుక సినీ పరిశ్రమకు సంబంధించి ప్రతీ అంశం, సమస్యపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది.

దాసరి నారాయణ రావు తర్వాత అందరూ సినీ పరిశ్రమకి ఆయనే పెద్ద దిక్కుగా భావిస్తున్నారు. కనుక ఆయన చొరవ తీసుకొని ఈ సమస్యకు పరిష్కారం సూచిస్తే అందరూ కట్టుబడి ఉండే అవకాశం ఉంటుంది.

ఇక సినీ పరిశ్రమ నుంచే రాజకీయాలలోకి వచ్చిన పవన్ కళ్యాణ్‌కి ఈ సమస్యలపై పూర్తి అవగాహన ఉంది. పైగా డెప్యూటీ సిఎం పదవిలో ఉన్నారు. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కూడా జనసేనకు చెందినవారే. కనుక పవన్ కళ్యాణ్‌ తలుచుకుంటే ఈ సమస్యని పరిష్కరించగలరు.

మొదట నిర్మాతలు, ఎగ్జిబిటర్స్ కూర్చొని మాట్లాడుకొని ఈ సమస్యని పరిష్కరించుకునే ప్రయత్నం చేశారు. కానీ పెద్ద, చిన్న నిర్మాతలు, మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ థియేటర్లు.. వంటి అంతరాలు, భేషజాలు, పంతాలు, పట్టుదలల వలన సమస్యని పరిష్కరించుకోలేకపోయారు. పైగా ఎవరికి వారు ప్రెస్‌మీట్‌ పెడుతూ పరస్పరం నిందించుకున్నారు. దీని వలన సమస్య ఇంకా జటిలమైంది. కాస్త ఆలస్యంగానైన వారు మెగా బ్రదర్స్ వద్దకు వెళ్ళడం మంచిదే.

ఇటువంటి సందర్భాలలో చిరంజీవి ఆచితూచి వ్యవహరిస్తుంటారు. జూన్‌ 4న పెద్ది రిలీజ్‌ ఉంది కనుక ఆలోగా ఈ సమస్యని పరిష్కరించాల్సి ఉంటుంది. లేకుంటే పెద్దికి నష్టం వస్తుంది.

ఒకవేళ చిరంజీవి ఈ సమస్యని పరిష్కరించలేకపోతే డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ తప్పకుండా ఈ సమస్యకి శాశ్విత పరిష్కారం చూపగలరనే ఆశిద్దాం.

ADVERTISEMENT
Latest Stories