డబ్బుల కోసం రామ్ చరణ్ నన్ను హింస పెట్టాడు – చిరంజీవి!

Chiranjeevi Ram Charan Khaidi No 150 Interview‘ఖైదీ నంబర్ 150’ సినిమా ఎలా ఉందో కాసేపు పక్కనపెడితే, ఈ సినిమాలో చిరంజీవి ఎలా ఉన్నారు? అంటే అందరి దగ్గర నుండి ఒకే రకమైన సమాధానం వెలువడుతోంది. తన కొడుకు పక్కన నటించిన కాజల్ కు సరిజోడిగా చిరు సరిపోయారు అంటేనే అర్ధమవుతుంది… మెగాస్టార్ ఏ రేంజ్ లో వర్కౌట్స్ చేసారో అన్నది. అయితే దీని వెనుక దాగి ఉన్న ‘స్కెచ్’ గురించి మెగాస్టార్ స్వయంగా వివరించారు.

చిరంజీవి, రాం చరణ్, వీవీ వినాయక్ లతో కలిసి నిహారిక చేసిన ఇంటర్వ్యూలో… “డాడీ… నీ ఫిట్ నెస్ మంత్రం ఏంటో చెబితే, నేను కూడా మా నాన్నకు చెప్పి, ఫిట్ చేసుకుంటా” అని నిహారిక చిరంజీవిని అడిగిన సమయంలో… పెద్దగా నవ్వేసిన చిరంజీవి… కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతో ముఖ్యమని చెప్పారు. తన భార్య సురేఖ, రామ్ చరణ్ ఫుడ్, ఎక్సర్ సైజుల గురించి నిత్యమూ పర్యవేక్షిస్తుండే వారని, ప్రొటీన్లతో కూడిన ఆహారం తీసుకోవడం, నిత్యమూ వ్యాయామంతో బరువు తగ్గించుకుంటూ వచ్చానని అన్నారు.

ADVERTISEMENT

“నా కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన సపోర్ట్, ప్రేమతో… నా పని సులువైంది. ఇదంతా ఆలోచిస్తుంటే… అబ్బా నా మీద ఎంత ప్రేముంది అనుకునేవాడిని. కానీ అది ప్రేమ కాదు… వాడు నా సినిమా నిర్మాత. సో, హీరో బాగుంటేనే కదా నాలుగు డబ్బులు వస్తాయని, డబ్బు మీద మమకారంతో వీడు నన్ను నానా హింసలూ పెట్టాడు, తరువాత నాకు అర్థమైంది… అంటూ రామ్ చరణ్ గురించి మెగాస్టార్ చమత్కరించారు. ఇంతలో వినాయక్ కల్పించుకుని, చెర్రీకి మీరంటే ఎంతో ప్రేమని స్పష్టం చేసారు.

ADVERTISEMENT
Latest Stories