సంతోషం లేదు… ‘సైరా’తో మళ్ళీ కొడతాం..!

Chiranjeevi says rangasthalam breaks Khaidi N0.150 records
మెగాస్టార్ చిరంజీవి కం బ్యాక్ ఫిల్మ్ “ఖైదీ నంబర్ 150” సినిమా నాన్ బాహుబలి రికార్డులను కొల్లగొట్టిన విషయం తెలిసిందే. 100 కోట్ల షేర్ అందుకున్న నాన్ బాహుబలి అందుకున్న రికార్డులను, ఇటీవల రామ్ చరణ్ “రంగస్థలం” సినిమాతో తుడిపివేసిన విషయం తెలిసిందే. యూనివర్సల్ హిట్ అందుకున్న ఈ సినిమా కలెక్షన్స్ ఇంకా క్లోజ్ కాకపోయినప్పటికీ, మెగాస్టార్ ‘ఖైదీ నంబర్ 150’ రికార్డులను అయితే ఎప్పుడో బద్దలు కొట్టింది.

ఇదే విషయాన్ని చిరు తన యుఎస్ టూర్ లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘నాన్ బాహుబలి’ రికార్డులు వచ్చాయన్న సంతోషాన్ని ఎక్కువసేపు చరణ్ ఉంచలేదు అంటూ చమత్కరించిన చిరంజీవి, ‘మళ్ళీ కొడతాం సైరా’తో అనగానే, అక్కడ ఉన్న వారంతా ఫక్కున నవ్వేసారు. రికార్డుల కన్నా ఎక్కువ ఆనందం పుత్రోత్సాహంతో కలిగిందని, చరణ్ గురించి అందరూ చెప్తుంటే ఎనలేని ఆనందం కలిగిందని గర్వంగా చెప్పుకొచ్చారు మెగాస్టార్.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories