తాప్సీకి చురకలంటించిన మెగాస్టార్!

chiranjeevi speech at mishan impossible eventసినీ వేదికలపై అద్భుతమైన స్పీచ్ లను అందివ్వడంలో మెగాస్టార్ చిరంజీవికి మరొకరు సాటిరారు అనే విధంగా “మిషన్ ఇంపాసిబుల్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రసంగించారు. ఈ సినిమాను చూసానని చెప్పిన మెగాస్టార్, తనను నమ్మి సినిమాకు వెళితే మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడరు, ఇది నా భరోసా అనే నమ్మకాన్ని కలిగించారు. చిన్న సినిమాను పెద్ద మనసుతో చూడండి అంటూ ఆడియన్స్ కు పిలుపునిచ్చారు.

“ఆర్ఆర్ఆర్” లాంటి సినిమాకు ఎవరూ ఏం చెప్పనవసరం లేదు, ప్రస్తుతం ప్రపంచమంతా దున్నేస్తోంది, ఈ సందర్భంగా రాజమౌళికి మరియు ఆయన టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించిన సుహాస్ ను ప్రస్తావిస్తూ, ‘నీ కలర్ ఫోటో సినిమా చూసాను, చాలా బాగుంది’ అని చెప్పి స్టేజ్ పైన సుహాస్ కు కన్నీళ్లు తెప్పించారు మెగాస్టార్. అలాగే కలర్ ఫోటో చిత్ర దర్శకుడు మరియు స్టేజ్ పైన ఉన్న ఇతర యువ దర్శకులను పేరుపేరునా అభినందించారు.

ADVERTISEMENT

“మిషన్ ఇంపాసిబుల్” సినిమాలో నటించిన ముగ్గురు పిల్లలు చక్కగా నటించారని, ఇక కీలకపాత్ర పోషించిన తాప్సీ బాగా చేసిందని చెప్పిన చిరు, “ఝుమ్మంది నాధం” సినిమాలో ఎంతో క్యూట్ గా కనిపించిన ఈ పిల్లేనా ఇలా చేస్తోందని ఆశ్చర్యపోయినట్లుగా తెలిపారు. బాలీవుడ్ కు వెళ్లి పవర్ ఫుల్ రోల్స్ ని చేస్తోన్న తాప్సీతో ఒక సినిమా చేయాలని ఉందని, ఈ సందర్భంగా ఓ సినిమాకు కమిట్ చేయించండి అంటూ నిర్మాత నిరంజన్ రెడ్డికి నవ్వుతూ చెప్పారు.

‘ఝుమ్మంది నాధం’ సినిమా రిలీజ్ అయిన సమయంలో తాను రాజకీయాల్లోకి వెళ్లి తప్పు చేసానని, లేదంటే తాప్సీతో చేసే అవకాశం ఉండేదని, ఇప్పుడైనా మించిపోయింది ఏమి లేదు ఒక సినిమా చేస్తాను, కానీ అమితాబ్ కు ఎదురుగా ఆయన్నే డామినేట్ చేసే విధంగా నటించినట్లు, నాతో కూడా చేస్తానంటే యాంకర్ సుమ ఒప్పుకోదు, నేను ఒప్పుకోను, నాకు గౌరవం ఇవ్వాల్సిందే అంటూ ఓ రకంగా తాప్సీకి ఫ్లాష్ బ్యాక్ ను గుర్తు చేసారు.

తెలుగు సినిమాలపై తాప్సీ చేసిన కామెంట్స్ ఎంత రచ్చ చేసాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ మొత్తం బొడ్డును చూపించడంలో తప్ప ఏం తెలియదన్నట్లుగా చేసిన వ్యాఖ్యలకు, మెగాస్టార్ చేసిన వ్యాఖ్యలు చురకలంటించినట్లయ్యింది. నవ్వుతూనే చెప్పినా, ప్రస్తుతం తెలుగు సినిమా ఏం చేస్తోందో కూడా “ఆర్ఆర్ఆర్”ను ఉద్దేశిస్తూ తాప్సీకి టాలీవుడ్ ను పవర్ ను తెలియజేసేలా మాట్లాడారు చిరంజీవి.

ADVERTISEMENT
Latest Stories