మెగా ఫ్యాన్స్ కు కావాల్సిన వీడియో… పండగ చేసుకోండి..!

Pawan Kalyan wife Anna Lezhneva photos at Srija wedding3మెగాస్టార్ చిరంజీవి ఇంట జరిగిన శ్రీజ వివాహానికి సంబంధించి ఇప్పటివరకు చాలా వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేసాయి. అయితే అవన్నీ శ్రీజ వివాహానికి సంబంధించిన సమాచారాన్ని మాత్రమే అందించాయి గానీ, మెగా అభిమానులకు కావాల్సిన రచ్చ చేయలేదు. ఆ లోటును పూడ్చేందుకు తాజాగా ఓ వీడియో చక్కర్లు కొడుతోంది.

శ్రీజను పెళ్లి కూతురు చేసే సమయం నుండి బెంగుళూరులో జరిగిన వివాహం వరకు క్లుప్తంగా రూపొందించిన ఈ వీడియోలో మెగా ఫ్యాన్స్ కు కావాల్సిన హంగామా అంతా ఉంది. ముఖ్యంగా శ్రీజను పెళ్లి కూతురు చేసే సందర్భంలో కుటుంబీకులు బిందెలతో నీళ్ళు పోస్తున్నపుడు శ్రీజతో పాటు, రామ్ చరణ్, అక్క సుష్మిత చేసిన సందడి వీక్షకులకు ఆహ్లాదకరమైన అనుభూతిని పంచుతోంది.

ADVERTISEMENT

అలాగే సంగీత్ కార్యక్రమంలో మెగాస్టార్ వేసిన స్టెప్పులు అభిమానులకు కన్నుల పండుగగా నిలిచాయి. రామ్ చరణ్, వరుణ్ తేజ్, అల్లు అర్జున్, సాయి ధరం తేజ్ లతో కలిసి మెగాస్టార్ చేసిన డ్యాన్సులు వీడియోకే హైలైట్ గా నిలిచాయి. అలాగే పెళ్లి కూతురు శ్రీజ – పెళ్ళికొడుకు కళ్యాణ్ ల సంగీత్ స్టెప్పులు, పెళ్లిలో చలాకీ పిల్ల నిహారిక చేసిన అల్లరితో కూడిన వీడియో… పెళ్లి ఎంత ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిందో చాటి చెప్తోంది.

Click Here for Photos

ADVERTISEMENT
Latest Stories