రాజమౌళికి పెద్ద షాక్ ఇచ్చిన తెలుగు హీరో!

Chiyaan vikram garudaతెలుగులో అవకాశాలు రాక తమిళంలో స్థిరపడ్డ హీరో విక్రమ్ దర్శక ధీరుడు రాజమౌళికి పెద్ద షాక్ ఇచ్చారు. “బాహుబలి” సినిమా విజయోత్సవం జరుపుకుంటున్న సమయంలో తన డ్రీం ప్రాజెక్ట్ “గరుడ” జక్కన్న ప్రస్తావించారు. దాదాపు 1000 కోట్లతో భారీ తారాగణంతో “గరుడ” సినిమాను తెరకెక్కించాలనే అభిలాషను వ్యక్తపరిచారు. కానీ తాజాగా ఈ సినిమా టైటిల్ తో విక్రమ్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమాను తెరకెక్కించబోతున్నాడని సమాచారం.

ADVERTISEMENT

అయితే విక్రమ్ హీరోగా రూపొందబోయే ‘గరుడ’ సినిమా కూడా భారీ బడ్జెట్ తో నిర్మితం కాబోతోందని తెలుస్తోంది. ఏప్రిల్ 1వ తేదీన ప్రారంభం కాబోతున్న ఈ సినిమాలో విక్రమ్ కు జోడిగా ‘చందమామ’ కాజల్ అగర్వాల్ నటిస్తోంది. దీనికి సంబంధించిన దర్శకుడు, నిర్మాత తదితర ఇతర సమాచారం తెలియాల్సి ఉంది. అయితే ‘గరుడ’ టైటిల్ ను ఇంతకు ముందే రాజమౌళి ప్రకటించడంతో మరి విక్రమ్ వెనక్కి తగ్గుతారో లేదో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories