“సర్ధార్ గబ్బర్ సింగ్”లో చిరంజీవి “రీమిక్స్” సాంగ్!

pawan kalyan chiranjeeviమెగాస్టార్ చిరంజీవి పాటలను రీమిక్స్ చేసుకుని తద్వారా హిట్లు అందుకోవడంలో రామ్ చరణ్, సాయి ధరం తేజ్ లకు ప్రత్యేక నైపుణ్యం ఉందని వారి గత చిత్రాల చరిత్రే చెబుతోంది. అయితే ఈ బాటలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా పయనిస్తున్నారని తాజా సమాచారం. తన అన్నయ్య సినిమాలో ఒక సూపర్ హిట్ సాంగ్ రీమిక్స్ లో పవన్ కళ్యాణ్, లక్ష్మీ రాయ్ కలిసి చిందులేసినట్లుగా టాక్.

ADVERTISEMENT

మెగాస్టార్ చిరంజీవి “కొండవీటి రాజా” సినిమాలోని ‘నీ కోక బాగుందా… నీ రైక బాగుందా…’ అనే పాట ఎంత హిట్ అయ్యిందో తెలిసిన విషయమే. మాస్ వర్గాలను ఊపేసిన ఈ పాటకు సరికొత్తగా మళ్ళీ దేవిశ్రీప్రసాద్ సంగీతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ ప్రేక్షకులకు అందించబోతున్నారని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

డ్యాన్స్ లకు పెట్టింది పేరు మెగాస్టార్. ఈ పాటలో కూడా తనదైన రేంజ్ లో పంచె కట్టుతో ఇరగదీస్తారు చిరు. అయితే పవన్ మాత్రం పంచె కట్టు కాదు, పోలీస్ డ్రెస్ అంటున్నాడు. లక్ష్మీ రాయ్ తో కలిసి పోలీస్ డ్రెస్ లో పవన్ వేసిన చిందులు ఈ సినిమాకున్న హైలైట్స్ లో ఒకటిగా ఉంటుందని అంటున్నారు సినీ వర్గీయులు. ఈ వార్త నిజమైతే మెగా అభిమానులకు అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు.

ADVERTISEMENT
Latest Stories