ఈ గెటప్ లేంటి… ఈ సినిమా ఏంటి… అనుకున్నాం..!

comedian ali about jambalakidi pamba movie కమెడియన్ గాను, హాస్య కథానాయకుడిగాను ప్రేక్షకుల మనసులో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న అలీ, బుల్లితెర పైన కూడా సందడి చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో ఈవీవీ ‘జంబలకిడిపంబ’ సినిమా గురించి ప్రస్తావించారు. “జంబ లకిడి పంబ’ సినిమాలో ఈవీవీ సత్యనారాయణగారు మాతో లేడీ గెటప్స్ వేయిస్తుంటే ఈ గోలేంట్రా బాబూ అనుకునేవాళ్లం.

షూటింగులో వున్న వాళ్లంతా హాస్య నటీనటులే కావడంతో స్పాట్ అంతా గోలగోలగా ఉండేది. సర్కస్ లో రింగ్ మాస్టర్ లా వ్యవహరిస్తూ ఈవీవీ గారు మాతో ఆ సినిమా చేయించారు. సినిమా డబ్బింగ్ చెప్పేశాము… చెన్నైలో ఒక షో వేశారు… ఏంటి ఈ సినిమా విచిత్రంగా వుంది, ఆడుతుందా? అనుకున్నాం. సినిమా రిలీజ్ అయిన తరువాత సూపర్ హిట్ అయింది, మేమందరం ఆశర్యపోయాం.

ADVERTISEMENT

చెన్నైలో 100 రోజుల ఫంక్షన్లో ఈవీవీ గారు ‘ఆర్టిస్టులు తమ పాత్రలకు న్యాయం చేయడం వల్లనే ఈ సినిమా ఈ స్థాయిలో ఆడిందని’ మెచ్చుకున్నారు. అవార్డుతో పాటు ఆయన సొంత డబ్బులో నుంచి ప్రతి ఆర్టిస్ట్ కి పది వేల రూపాయలు ఇచ్చారని నాటి మధురమైన సంఘటనలను జ్ఞప్తికి తెచ్చుకున్నారు. లేటెస్ట్ ‘జంబలకిడిపంబ’ ఫేం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్న ఈ షోలో ఈ ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ADVERTISEMENT
Latest Stories