కమెడియన్ పృథ్వి జగన్ ను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు

Comedian Prudhvi - YS Jaganకమెడియన్ పృథ్విని ఆ మధ్య పార్టీకి చేసిన సేవలకు గాను జగన్ ఆయనను టీటీడీ ఆద్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ గా నియమించారు. అయితే కొండపైన ఒక ఉద్యోగినితో సరససల్లాపాలు ఆడి పోస్టు ఊడగొట్టుకున్నారు. ఆ తరువాత జగన్ ఆయనను కొంత దూరం పెట్టడంతో సినిమాలలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు.

పదవిలో ఉన్నప్పుడు చేసిన ఓవర్ యాక్షన్ కారణంగా సినిమా అవకాశాలు కూడా పెద్దగా రావడం లేదు. మరోవైపు… పృథ్వి మరో సారి జగన్ ని ఇబ్బంది పెట్టారు. మొన్న క్రిస్మస్ పండుగ సందర్భంగా మెడలో శిలువ వేసుకుని క్రిస్మస్ చెట్టు పక్కన ఆయన పోజ్ ఇస్తూ ఒక ఫోటో దిగారు.

ADVERTISEMENT

ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వివాదాంశం అవుతుంది. అటువంటి వ్యక్తిని జగన్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ గా నియమించారా అంటూ పలువురు విమర్శలు చేస్తున్నారు. ఇటువంటి వైఖరే ఆంధ్రప్రదేశ్ లో మతమార్పిడులకు కారణం అని… ఇప్పుడు టీటీడీ విషయంలోనూ ఇలానే వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుండీ తిరుపతి విషయంలో ఏదో ఒక కాంట్రవర్సీ రావడం పరిపాటి అయ్యింది. అయినా అధికార పార్టీ సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం శోచనీయం. పైగా తిరుపతి ఉపఎన్నిక త్వరలో జరగనున్న నేపథ్యంలో ఇలా జరగడం విశేషం.

ADVERTISEMENT
Latest Stories