రెండు పడవల ప్రయాణం అవసరమా సునీల్?

comedian sunil planning to remake Andhadhun in teluguతెలుగు సినీ పరిశ్రమ లో ప్రారంభం నుంచి కమెడియన్ గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టి హీరోగా మారిన సునీల్ మొదట్లో భారీ హిట్లే సాధించాడు. అయితే క్రమేపీ ప్రజలకు ఆయన సినిమాలు బోర్ కొట్టేసి చూసే వారు లేకుండా అయిపోయింది. ఆయన సినిమాలకు టీవీ హక్కులు కూడా అమ్ముకోవడం కష్టం కావడంతో నిర్మాతలు మొహం చాటేశారు. దానితో మళ్ళీ కమెడియన్ పాత్రల వైపు నడుస్తున్నాడు సునీల్. ఇప్పటికే కొన్ని సినిమాలు చేసినా ఇంకా ఆ పాత సునీల్ కనపడటం లేదు.

ఈ క్రమంలో సునీల్ మళ్ళీ హీరో పాత్రల వైపు చూస్తున్నాడు. హిందీలో సక్సెస్ అయిన అందాధూన్ చిత్రంలో సునీల్ ని హీరోగా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయుష్మాన్ ఖురానా, టబూ, రాధికా ఆప్టే నటించిన ఈ సినిమా హక్కుల కోసం ఒక నిర్మాత ప్రయత్నిస్తున్నారు. సునీల్ ఇప్పటికే నటించడానికి ఒప్పుకున్నాడట. రీమేక్ హక్కుల అగ్రిమెంట్ అవ్వగానే సినిమా మీద ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అయితే సునీల్ తీసుకున్న ఈ నిర్ణయంపై కొందరు పెదవి విరుస్తున్నారు.

ADVERTISEMENT

“హీరో సినిమాలతో సునీల్ కు భవిష్యత్తు లేదని తెలుసుకోవాలి. హీరోగా చెయ్యాలని మోజు ఉండటం సహజమే అయితే దానిని అణుచుకోకపోతే ఆయనకే ఇబ్బంది. రెండు పదవుల ప్రయాణం చెయ్యాలని చూస్తే రెండిటికి కాకుండా పోవడం ఖాయం,” అని వారు హెచ్చరిస్తున్నారు. సునీల్ ప్రస్తుతం అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమా, రవి తేజ డిస్కో రాజా చిత్రాలలో కీలక పత్రాలు పోషిస్తున్నారు. సునీల్ తీసుకున్న తాజా నిర్ణయం ఆయన కేరీర్ ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories