ఒకప్పటి స్నేహితులు పవన్ కళ్యాణ్ అలీల మధ్య రాజకీయాలు చిచ్చు రేపాయి. అలీని నేను కష్టకాలంలో ఆదుకున్నాని, ఆయన చెప్పిన అతనికి టిక్కెట్ ఇస్తే ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ కు పని చేస్తున్నారని అప్పటి నుండి నేను స్నేహితులు, బంధువులను నమ్మడం మానేశా అని కేవలం అభిమానులనే నమ్ముకున్నా అని ఆయన నిన్న రాజమహేంద్రవరం చెప్పుకొచ్చారు. దీనికి అలీ సుత్తిమెత్తగా మాట్లాడుతూనే గట్టి బదులు చెప్పారు. మీరు చిరంజీవి నీడలో నుండి వచ్చారు. నేను స్వశక్తితో పైకి వచ్చా అని చెప్పుకొచ్చారు అలీ.
‘‘ఆలీ కష్టాల్లో ఉన్నప్పుడు సాయపడ్డాను అని పవన్ అన్నారు. మీరు ఏ విధంగా సాయపడ్డారు పవన్ సర్. అంటే ధనం ఏమైనా ఇచ్చారా? నాకు ఏమైన సినిమాలు చెప్పారా? సినిమాలు లేక ఇంట్లో ఉంటే తీసుకెళ్లి అవకాశాలు ఇప్పించారా? సర్.. మీరు ఇండస్ట్రీలోకి రాకమునుపు నుంచి నేను ఒక మంచి పొజిషన్‌లో ఉన్నాను సర్. నేను ఎవ్వరి దగ్గరా అయ్యా నేను కష్టాల్లో ఉన్నాను. రూపాయి సాయం చేయమని ఏనాడూ ఎవ్వరి దగ్గరా అడగలేదు. అల్లా దయవల్ల చాలా బాగున్నాను. ఇంకా అడిగే అవకాశం వస్తే అప్పటికి ఆలీ ఉండడు. వెళ్లను కూడా. ఆకలితో చచ్చిపోతాను తప్ప వెళ్లి అమ్మా.. దేహీ అనే స్థితికి వెళ్లను,” అని అలీ ఉద్వేగభరితంగా చెప్పారు.
మీకు తెల్సు నేను కుటుంబాన్ని ఎలా చూసుకుంటానో. నేను ఎవ్వర్ని మనసు బాధపడేలా ఇంతముక్క చెప్పను. మీరు రాజమండ్రిలో విమర్శ చేయటం సరికాదు. వైయస్సార్ సీపీలో వెళ్లటం తప్పేంటి? అదేమైన నేరమా? రాజ్యాంగంలో రాసుందా అక్కడకు వెళ్లకూడదని. నాకు స్వేచ్ఛ లేదా? మీ గురించి నేను వ్యాఖ్యానిస్తే మీరు నాగురించి కామెంట్ చేయాలి. నేను ఎవరికైనా టిక్కెట్ ఇవ్వమని చెప్పానా లేక నాకు చెప్పి మీరు టిక్కెట్ ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. వైకాపాలో చేరినా అలీ పవన్ పై ఎటువంటి కామెంట్లు చెయ్యలేదు. అటువంటి అలీని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి ఉండాల్సింది కాదు.



